తన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని తాను ముందే ఊహించానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. దేవుడితో పాటు ప్రజల ఆశీస్సులు, భగవంతుడి కృప వల్లే విజయం దక్కిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తప్పకుండా అమలుపరుస్తారని తాను ఆశీస్తున్నట్లు విజయమ్మ తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 30వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.