
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరుకు టీడీపీ అడ్రస్ గల్లంతయింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని బీరాలు పలికిన చంద్రబాబు నాయుడుకి ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు గెలచుకోగా.. టీడీపీ 23 దగ్గరే ఆగిపోయింది. ఇక 22 పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోగా.. మూడు స్థానాలకే టీడీపీ పరిమితమైంది. దీంతో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, టీడీపీలపై ట్రోలింగ్ మొదలైంది. తాజాగా హీరో మంచు విష్ణు నారాకు సరికొత్త అర్థం చెబుతూ ట్విటర్‌లో వ్యంగ్యంగా స్పందించారు.
‘నారా అంటే.. జాతీయ స్థాయిలో ఆశయాలు.. ప్రాంతీయ స్థాయిలో ఆకాంక్షలు. మన ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీజీ ఎవరినీ ఇలా ట్రోల్ చేశారో.. మనందరికీ తెలుసు’అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం విష్ణు చేసిన ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. జాతీయ స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పాలనుకున్నారని.. కానీ ఏపీ ప్రజలు ఆయనకు విశ్రాంతినిచ్చారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ‘ఇంట్లోనే’ బాబు ఓడిపోయారు.. ఇక బయటేం గెలుస్తారు’అంటూ మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
‘NARA’ - ‘N’ational ‘A’mbition and ‘R’egional ‘A’spirations. I have a strong feeling our beloved PM @narendramodi ji is trolling someone we all know 🤔😉😳
— Vishnu Manchu (@iVishnuManchu) 26 May 2019