
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలు తనపై మరింత బాధ్యత ఉంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కౌంటింగ్ అనంతరం గురువారం సాయంత్రం ఆయన తాడేపల్లి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...‘గొప్ప విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం. దేవుడి దయ, ప్రజల దీవెనలతో ఈ విజయం సాధ్యమైంది. ఈ విజయం నా బాధ్యతను పెంచుతుంది. ప్రజలంతా విశ్వసనీయతకు ఓటు వేశారు. ఏడాదిలోపే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటాం. తొలి సంతకం కాదు...నవరత్నాల హామీలును అమలు చేస్తాం. పాదయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరి కష్టాలను నేను చూశా.... నేను విన్నా ..నేను ఉన్నా. ఈ నెల 30 విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment