చంద్రబాబును ఎద్దేవా చేసిన అమిత్‌ షా..! | BJP President Amit Shah Satires To Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబును ఎద్దేవా చేసిన అమిత్‌ షా..!

Published Fri, May 24 2019 10:51 AM | Last Updated on Fri, May 24 2019 10:51 AM

BJP President Amit Shah Satires To Chandrababu Naidu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ చుట్టూ తిరిగేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన కృషి ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు సాధించుకునేందుకు చేసుంటే ఆయనకు మరికొన్ని సీట్లైనా దక్కేవని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజాయాన్ని సాధించిన అనంతరం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగిన విజయోత్సవ సభలో షా మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్షపార్టీలను ప్రస్తావిస్తూ మరీ ముఖ్యంగా చంద్రబాబుకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నానని అంటూ పైవిధంగా వ్యాఖ్యానించారు.‘ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి బీజేపీ తరపున అభినందనలు తెలుపుతున్నా’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement