రేపు గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌ | YSRCLP Meeting On May 25th | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం రేపు సమావేశం

Published Fri, May 24 2019 6:52 PM | Last Updated on Fri, May 24 2019 9:04 PM

YSRCLP Meeting On May 25th - Sakshi

హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం రేపు(మే 25న) ఉదయం పదిన్నర గంటలకు పార్టీ కార్యాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేత ఎన్నిక జరుగుతుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ఎమ్మెల్సీలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ శాసనసభ్యుల బృందం రేపు మధ్యాహ్నం గవర్నర్‌  నరసింహన్‌ను కలవనున్నట్లు పార్టీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement