
సాక్షి, హైదరాబాద్ : ప్రశ్నిస్తా అంటూ ప్రజల ముందుకు వచ్చిన జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఓటర్లు ‘సినిమా’ చూపించారు.. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు శాసనభ స్థానాల్లోనూ ఘోర పరాజయం పాలయ్యారు. ఆయన సోదరుడు నాగబాబు నరసాపురం లోక్‌సభ స్థానంలో ఓడిపోయారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన పవన్.. రెండు స్థానాల్లో పోటీచేయగా ఆ రెండు స్థానల్లో ప్రజలు తిరస్కరించారు.
భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలైన జనసేనాని.. గాజువాకలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తిప్పాల నాగిరెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు. ఇక ఎన్నికల ముందు పార్టీ కండువా కప్పుకొని నరసాపురం ఎంపీగా బరిలోకి దిగిన నాగబాబు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు చేతిలో చిత్తుగా ఓడి మూడో స్థానంలో నిలిచారు. జనసేనాని ఓటమితో ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి ఆ పార్టీ మద్దతుదారులు ఊహించని ఫలితాలతో ముఖం చాటేశారు. ఆ పార్టీ అధికారిక ట్విటర్ మూగబోయింది.
Comments
Please login to add a commentAdd a comment