బాబు.. ఆ అడుగుల చప్పుడు వినిపించలేదా? | Viral Satish Acharya Cartoon About YS Jagan Padayatra | Sakshi
Sakshi News home page

బాబు.. ఆ అడుగుల చప్పుడు వినిపించలేదా?

Published Fri, May 24 2019 3:37 PM | Last Updated on Fri, May 24 2019 3:46 PM

Viral Satish Acharya Cartoon About YS Jagan Padayatra - Sakshi

సతీష్‌ ఆచార్య షేర్‌ చేసిన కార్టూన్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించించడం.. టీడీపీ అడ్రస్‌ లేకుండా గల్లంతవ్వడం తెలిసిందే. ఇప్పటికే టీడీపీ దారుణ ఓటమిపై సోషల్‌ మీడియాలో కుళ్లు జోకులు కూడా పేలాయి. ముఖ్యంగా చంద్రబాబును నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. తాతకు మనవడితో ఆడుకునే సమయం దొరికిందని, బాబు ప్రయాణం మాయవతి టూ గవర్నర్‌ వయా సోనియా, మమతలుగా సాగి ముగిసిందనే ఫన్నీమీమ్స్‌, కామెంట్స్‌ను ట్రెండ్‌ చేశారు. అయితే తాజాగా ప్రముఖ కార్టూనిస్ట్‌ సతీష్‌ ఆచార్య తన ట్విటర్‌లో షేర్‌ చేసిన ఓ కార్టూన్‌ నెటిజన్లను, రాజకీయ వర్గాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వైఎస్‌ జగన్‌ పాదయాత్రను ప్రతిబింబించేలా ఉన్న ఆ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట హల్‌ చల్‌ చేస్తుంది. ఏడాది పాటు మొక్కవోని దీక్షతో వైఎస్‌ జగన్‌ 3,648 కిలోమీటర్లు మేర చేసిన పాదయాత్ర ఆయనకు అఖండ విజయానందించింది. అయితే ఈ పాదయాత్రను లెక్కచేయని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుచరవర్గం.. జగన్‌ పాదయాత్రను అవహేళన చేస్తూ మాట్లాడారు. ఇదే వారిని చావుదెబ్బతినేలా చేసింది. ఈ విషయాన్నే సతీష్‌ ఆచార్య తన కార్టూన్‌లో తెలియజేశారు. ఆ కార్టూన్‌కు ‘చంద్రబాబు ఆ అడుగుల చప్పుడు వినిపించలేదా?’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement