కొత్త కొత్తగా ఉన్నది | First Time MLAs in Andhra Pradesh Assembly | Sakshi
Sakshi News home page

కొత్త కొత్తగా ఉన్నది

Published Sat, May 25 2019 10:30 AM | Last Updated on Sat, May 25 2019 4:31 PM

First Time MLAs in Andhra Pradesh Assembly - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలోకి తొలిసారిగా 70 మంది ఎమ్మెల్యేలు అడుగు పెట్టనున్నారు. వీరిలో 67 మంది వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌పై గెలుపొందగా, కేవలం ముగ్గురు టీడీపీ నుంచి కొత్తగా ఎన్నికైన వారు ఉన్నారు. మొత్తం సభ్యుల్లో దాదాపు సగం మంది తొలిసారి నెగ్గినవారే కావడం గమనార్హం. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మొత్తం 52 ఎమ్మెల్యే స్థానాలుండగా, ఈ ప్రాంతం నుంచి 25 మంది కొత్తగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో 34 సీట్లకు గాను కొత్తగా 12 మంది గెలిచారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 సీట్లకు గాను 13 మంది తొలిసారి గెలిచారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కలిపి 55 స్థానాలుండగా, 19 మంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. (చదవండి: ఏపీలో అత్యధిక, అతి స్వల్ప మెజారిటీలు)

అసెంబ్లీలో సీనియర్‌ ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగుతుండగా, సత్తెనపల్లి నుంచి విజయం సాధించిన అంబటి రాంబాబు 30 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. ఈయన తొలిసారిగా గుంటూరు జిల్లా రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీశైలం నుంచి గెలుపొందిన శిల్పా చక్రపాణిరెడ్డి గతంలో ఎమ్మెల్సీగా కొనసాగారు. ఇప్పుడు కొత్తగా అసెంబ్లీలోకి ప్రవేశిస్తున్నారు. గూడూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌పై గెలుపొందిన వరప్రసాద్‌ గతంలో ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు కొత్తగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంత వెంకట్రామిరెడ్డి గతంలో అనంతపురం ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు అనంతపురం శాసనసభ స్థానం నుంచి గెలిచారు.  (చదవండి: ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో ‘సిత్రాలు’)

తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు

వైఎస్సార్‌ జిల్లా      
జి. వెంకట సుబ్బయ్య (బద్వేల్‌), మూలె సుధీర్‌రెడ్డి (జమ్మలమడుగు)  

కర్నూలు జిల్లా  
బ్రిజేంద్రనాథ్‌రెడ్డి(ఆళ్లగడ్డ), శిల్పా చక్రపాణిరెడ్డి (శ్రీశైలం), తొగురు ఆర్థర్‌(నందికొట్కూరు), హఫీజ్‌(కర్నూలు), శిల్పా రవిచంద్రారెడ్డి(నంద్యాల), శ్రీదేవి(పత్తికొండ), సుధాకర్‌బాబు(కోడుమూరు)  

అనంతపురం జిల్లా  
వెంకటరామిరెడ్డి(గుంతకల్‌), కేతిరెడ్డి పెద్దారెడ్డి(తాడిపత్రి), జొన్నలగడ్డ పద్మావతి(శింగనమల), వెంకట్రామిరెడ్డి(అనంతపురం), ఉషశ్రీచరణ్‌(కల్యాణదుర్గం), ప్రకాశ్‌రెడ్డి(రాప్తాడు), శంకర్‌నారాయణ(పెనుగొండ), శ్రీధర్‌రెడ్డి(పుట్టపర్తి), సిద్ధారెడ్డి(కదిరి)

చిత్తూరు జిల్లా  
ద్వారకానాథ్‌(తంబళ్లపల్లి), నవాజ్‌ బాషా(మదనపల్లి), మధుసూదనరెడ్డి(శ్రీకాళహస్తి), కె.ఆదిమూలం(సత్యవేడు), శ్రీనివాసులు(చిత్తూరు), ఎంఎస్‌బాబు(పూతలపట్టు), వెంకటేశ్‌గౌడ్‌ (పలమనేరు)  

నెల్లూరు జిల్లా
వరప్రసాద్‌(సూళ్లూరుపేట)  

ప్రకాశం జిల్లా  
ఎం.వేణుగోపాల్‌(దర్శి), సుధాకర్‌ బాబు(సంతనూతలపాడు), కేపీ నాగార్జునరెడ్డి(మార్కాపురం), బుర్రా మధుసూదన్‌ (కనిగిరి)  
        
గుంటూరు జిల్లా
నంబూరి శంకరరావు(పెదకూరపాడు), ఉండవల్లి శ్రీదేవి(తాడికొండ), కిలారి రోశయ్య(పొన్నూరు), మేరుగ నాగార్జున(వేమూరు), శివకుమార్‌(తెనాలి), విడదల రజని(చిలకలూరి పేట), బొల్లా బ్రహ్మనాయుడు
(వినుకొండ), కాసు మహేష్‌ రెడ్డి (గురజాల)

కృష్ణా జిల్లా
దూలం నాగేశ్వరరావు(కైకలూరు), సింహాద్రి రమేష్‌(అవనిగడ్డ), వసంత కృష్ణప్రసాద్‌(మైలవరం), కైలే అనిల్‌(పామర్రు), ఎం.జగన్‌మోహన్‌రావు(నందిగామ)  

పశ్చిమ గోదావరి జిల్లా  
జి.శ్రీనివాస నాయుడు(నిడదవోలు), పుప్పాల శ్రీనివాసరావు(ఉంగుటూరు), అబ్బయ్య చౌదరి(దెందులూరు),     తలారి వెంకట్రావు(గోపాలపురం), వెంకట శివరామరాజు(ఉండి),
వీఆర్‌ ఎలిషా(చింతలపూడి)  

తూర్పు గోదావరి జిల్లా
పర్వత పూర్ణచంద్రప్రసాద్‌(పత్తిపాడు), సూర్యనారాయణరెడ్డి(అనపర్తి), వేణుగోపాల్‌(రామచంద్రపురం), జక్కంపూడి రాజా (రాజానగరం), జ్యోతుల చంటిబాబు(జగ్గంపేట), ధనలక్ష్మి(రంపచోడవరం), చిట్టిబాబు (పి.గన్నవరం)  

విశాఖ జిల్లా
తిప్పల నాగిరెడ్డి  (గాజువాక), చెట్టి ఫల్గుణ (అరకు), భాగ్యలక్ష్మి(పాడేరు), గుడివాడ అమరనాథ్‌(అనకాపల్లి), అన్నంరెడ్డి అదీప్‌ రాజు(పెందుర్తి), పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌(నర్సీపట్నం)

విజయనగరం జిల్లా  
జోగారావు(పార్వతీపురం), అప్పలనాయుడు(నెల్లిమర్ల), శ్రీనివాసరావు(శృంగవరపుకోట)  

శ్రీకాకుళం జిల్లా  
అప్పలరాజు (పలాస), రెడ్డి శాంతి (పాతపట్నం), కిరణ్‌కుమార్‌(ఎచ్చెర్ల)  

తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టే టీడీపీ ఎమ్మెల్యేలు  
మద్దాళి గిరి(గుంటూరు పశ్చిమ), వెంకట శివరామరాజు(ఉండి), ఆదిరెడ్డి భవానీ(రాజమండ్రి సిటీ) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement