జనసేన చీఫ్ పవన్ కల్యాణ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ఘోర ఓటమిపై ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పందించారు. సుదీర్ఘకాలం మార్పు కోసం తాను పార్టీ పెట్టానని చెప్పారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడ్డామని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. బలమైన మెజార్టీతో సీఎంగా గెలిచిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మరోసారి ప్రధాని అవుతోన్న నరేంద్ర మోదీకి కూడా శుభాకాంక్షలు చెప్పారు.
కేంద్రంలో, రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పార్టీలు ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉంటారని అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. జనసేన ద్వారా డబ్బులు, సారా పంచకుండా నూతన రాజకీయాలు చేశామని, అలాగే ఈ ఎన్నికల్లో కొత్తవారికి అవకాశం కల్పించామని అన్నారు. నేను రెండు స్థానాల్లో గెలవకపోయినా నా తుది శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటూ పోరాడతానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment