వైఎస్‌ జగన్‌కు హామీ ఇచ్చా: మోదీ | PM Narendra Modi Tweet About Ys Jagan Meet | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌తో భేటీపై ప్రధాని ట్వీట్‌

Published Sun, May 26 2019 2:21 PM | Last Updated on Sun, May 26 2019 8:42 PM

PM Narendra Modi Tweet About Ys Jagan Meet - Sakshi

ప్రధాని మోదీతో వైఎస్‌ జగన్‌

సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో జరిగిన భేటీపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయిన వైఎస్‌ జగన్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చ జరిపాము. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చాను.’ అని పేర్కొన్నారు. ఇక ఆ ట్వీట్‌ తెలుగు, ఇంగ్లీష్‌ రెండు బాషల్లో చేయడం విశేషం. ఇక ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సొంతం చేసుకున్న వైఎస్‌ జగన్‌ నేడు (ఆదివారం) ఢిల్లీలో ప్రధానితో సమావేశమైన విషయం తెలిసిందే.

విభజన హామీలను నెరవేర్చాలని, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రానికి సహాయం చేయాలని వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా మోదీని కోరారు. ఏపీకి రావాల్సిన పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని, ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల చంద్రబాబు నాయుడి పాలనలో రాష్ట్రం అందకారంలో ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని ప్రధానికి తెలియజేశారు. ఈ భేటీ సందర్భంగా రెండోసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీకి వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 30న విజయవాడలో జరగనున్న తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు.

వైఎస్‌ జగన్‌తో అద్భుతమైన సమావేశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement