
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు గురువారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్‌కు పంపారు. చంద్రబాబు రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తదుపరి నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ‍్యేవరకూ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు. అలాగే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సేవలకు గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.