
సాక్షి, అమరావతి: దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రధాన పార్టీలన్ని తమ సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలొస్తే ప్రజలు ఎవరిని గెలిపిస్తారని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ టౌమ్స్‌నౌ సర్వే ఫలితాలను విడుదల చేసింది.
తాజా సర్వే ఫలితాల్లో ఏపీలో ఈసారి కూడా వైఎస్సార్‌సీపీ అత్యధిక లోక్‌సభ సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్ స్థానాలకు గాను అధికార వైఎస్సార్‌సీపీ 19 స్థానాల్లో విజయ దుందుభి మోగిస్తుందని స్పష్టం చేసింది
ఇక.. ప్రతిపక్ష పార్టీలు ‘టీడీపీ-జనసేన’ ఎటువంటి ప్రభావం చూపకుండా కేవలం 6 స్థానాలకే పరిమితం అవుతుందని టౌమ్స్‌నౌ సర్వే పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ సర్కార్ పనితీరుకు పట్టం కట్టారు ప్రజలు. టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పనితీరు పట్ల 38 శాతం మంది అత్యద్భుతం అని కితాబు ఇచ్చారు. మరో 26 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి జగన్ పరిపాలన బాగుందని ప్రశంసించారు. ఈ రెండు కలిపితే ఏకంగా 64 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు.
Comments
Please login to add a commentAdd a comment