లోక్‌సభ ఎన్నికల సర్వే.. ఏపీలో YSRCPదే హవా | Times now ETG Survey 2024: YSRCP Sweep Major LS Seats In AP | Sakshi
Sakshi News home page

టైమ్స్‌ నౌ-ETG లోక్‌సభ ఎన్నికల సర్వే: ఏపీలో వైఎస్సార్‌సీపీదే హవా, ఎన్ని సీట్లంటే..

Published Fri, Mar 8 2024 8:48 PM | Last Updated on Sat, Mar 9 2024 2:34 AM

Times now ETG Survey 2024: YSRCP Sweep Major LS Seats In AP - Sakshi

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే హవా అని మరో సర్వే స్పష్టం చేసింది.  టైమ్స్‌ నౌ ETG సర్వేలో.. మొత్తం 25 సీట్లలో వైఎస్సార్‌సీపీ 21 నుంచి 22 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. అలాగే టీడీపీ జనసేన కూటమికి 3 నుంచి 4 స్థానాలు మాత్రమే వచ్చే ఛాన్స్‌ ఉందని తెలిపింది.

ఎన్టీయే కూటమికి 0(ఇంకా టీడీపీ-జనసేనలతో పొత్తు ఖరారు కాలేదు), ఇతరులు సున్నా కైవసం చేసుకుంటారని వెల్లడించింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 49 శాతం ఓటింగ్‌, టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం, ఎన్డీయే కూటమికి 2 శాతం, ఇతరులకు 4 శాతం ఓటింగ్‌ నమోదు కావొచ్చని అంచనా వేసింది.

2023 డిసెంబర్‌  13వ తేదీ నుంచి మార్చి  7వ తేదీ మధ్య ఏపీలో ఈ సర్వేను ఈటీజీ నిర్వహించింది. ఇందుకోసం మొత్తం 3లక్షల 20 వేల మంది నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇందులో క్షేత్రస్థాయి అభిప్రాయ సేకరణ 85 శాతం కాగా.. ఫోన్ల ద్వారా మరో 15 శాతం అభిప్రాయాలను సేకరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement