సాక్షి, ఢిల్లీ: బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తుపై హస్తిన వేదికగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ(శుక్రవారం) చంద్రబాబుకి బీజేపీ అగ్రనేత అమిత్ షా అపాయింట్‌మెంట్ దక్కలేదు. దీంతో గల్లా నివాసంలో బాబు, అటు తాజ్‌మహల్ సింగ్ హోటల్‌లో పవన్ కల్యాణ్ పడిగాపులు కాస్తున్నారు. ఎలాగైనా సరే పొత్తు ఖరారు చేసుకోవాలని డిసైడ్ అయిన ఈ ఇద్దరూ ఈ రాత్రికి, రేపు.. అవసరమైతే ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉంటారని సమాచారం.
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రస్తుతం ఒడిషా, మహారాష్ట్ర పొత్తులకు సంబంధించిన చర్చలతో బిజీగా ఉన్నారు. అందుకే ఆయన చంద్రబాబుని పట్టించుకోలేదని తెలుస్తోంది. అంతేకాదు.. రేపు ఉదయం ఆయన పాట్నా(బీహార్) పర్యటనకు వెళ్లాల్సి ఉంది. దీంతో ఈలోపే చంద్రబాబు అమిత్ షాను కలుస్తారని టీడీపీ వర్గాలు ప్రకటనలు చేసుకుంటున్నాయి. అయితే షా కార్యాలయం మాత్రం చంద్రబాబుకి అపాయింట్‌మెంట్ ఖరారైనట్లు ప్రకటనేం చేయలేదు. మరోవైపు పవన్ ద్వారా అయినా కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సైతం ఫలించడం లేదని సమాచారం.
ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక.. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీపడి ఇప్పుడు పొత్తు కోసం దేహి దేహి అంటున్నారు. అయితే బాబు రాజకీయం ఎరిగిన బీజేపీ.. ఏపీలో 9 ఎంపీ, 15 అసెంబ్లీ సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన కూటమి తటపటాయిస్తోంది.
ఇక.. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డ చంద్రబాబు.. 2018లో ప్రత్యేక హోదా కోసమే యేన్డీయే నుంచి బయటికి వచ్చానని ప్రగల్బాలు పలకడం గుర్తుండే ఉంటుంది. ఈ తరుణంలో.. కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఇప్పుడు ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏంటి? ప్రశ్నిస్తున్నారు పలువురు. ఇది రాష్ట్ర ప్రయోజనామా ? సొంత పార్టీ ప్రయోజనామా ? అని నిలదీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment