ఎన్నికల్లో ట్వీట్ చేశారు సరే అధికారంలోకి వచ్చాకా ఒక్కసారైనా మాట్లాడారా?
ఊహించని టైమ్స్ నౌ ప్రశ్నతో అవాక్కైన రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్
‘ఇండియాకి వస్తే అప్పుడు చూద్దాం’ అనడంతో యాంకర్ తెల్లముఖం
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ట్వీట్లతో లోకేశ్ చేసిన హడావుడిని ఆంగ్ల మీడియా ఛానెల్ టైమ్స్ నౌ జాతీయ స్థాయిలో ఎత్తి చూపింది. ‘‘ఫ్రాంక్లీ స్పీకింగ్’’ పేరుతో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఛానల్ యాంకర్ నుంచి వచి్చన ప్రశ్నతో లోకేశ్ తెల్లమొహం వేశాడు. ‘2024 ఏప్రిల్‌లో అనుకుంటా ఎన్నికల ముందు మీరు నేరుగా టెస్లా అధినేత ఎలన్ మస్క్ కు ట్యాగ్ చేశారుగా’ అంటూ యాంకర్ ప్రశ్న అడగడంతో లోకేశ్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
ట్వీట్‌లో ఏముందంటే..
ఎన్నికల సమయంలో ఏప్రిల్ 12న ఎలన్ ఎలన్ మస్క్ కు ట్యాగ్ చేస్తూ ‘2017లో అప్పటి సీఎం చంద్రబాబుతో కలిసి మీతో చర్చలు జరిపామని, మీరు ఇప్పుడు ఇండియాకు వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో మా బృందం దీనిపై చర్చించుకున్నామని, పెట్టుబడులకు ఏపీ ఒక ముఖద్వారమని, ఈరోజు నుంచి రెండు నెలల్లో టెస్లా ఏపీ నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తుంది’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
యాంకర్ ప్రశ్నల వర్షం..
ఇప్పుడు ఇదే ట్వీట్‌ను టైమ్స్‌నౌ యాంకర్ గుర్తు చేస్తూ ‘ఎన్నికల ముందు ట్యాగ్ చేశారు కదా.. ఇప్పటికే మూడు నెలలు దాటిపోయింది..ఎలన్ మస్క్‌తో ఏమైనా సంప్రదింపులు చేశారా’ అని అడిగింది. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న లోకేశ్ వెంటనే తేరుకొని ‘ఆయన ఎప్పుడు ఇండియాకు వస్తే అప్పుడు చర్చలు జరుపుతాం’ అన్నారు. అంటే ఆయన ఇండియాకి వస్తేనే చర్చలు అంటే దానిపై నాకు నమ్మకంలేదు.. ప్రజలు ఏం జరుగుతోందో తెలుసుకోవాలనుకుంటున్నారు.. ఈ షో పేరే ‘ఫ్రాంక్లీ స్పీకింగ్’ సరైన సమాధానం చెప్పండి అని యాంకర్ రెట్టించి అడగడంతో లోకేశ్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు.. ముఖంమీదకి లేని చిరునవ్వు తెప్పించుకుంటూ తాము 2015 నుంచే ఎలన్ మస్క్‌తో చర్చలు జరుపుతున్నామని, అధికారంలో లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఏపీలో పెట్టుబడుల గురించి సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పుకుపోతుంటే యాంకర్ మధ్యలో అందుకొని ఇదంతా కాదు...మీరు అధికారం చేపట్టి 100 రోజులు దాటిన తర్వాత అడుగుతున్నా.. ఇంత వరకు మీరు చర్చలు జరిపారా? లేదా? అని మరోసారి అడిగితే నేరుగా సమాధానం చెప్పకుండా దేశంలో పెట్టుబడులకు ఏపీ మొదటిస్థానమని, టెస్లానే కాకుండా అన్ని రంగాల గురించి చర్చిస్తున్నామంటూ లోకేశ్ సమాధానం దాటవేయడంతో జాతీయ స్థాయిలో లోకేశ్ పరువు పోయింది.. దీంతో యాంకర్‌చేసేది లేక వేరే ప్రశ్నలకు వెళ్లిపోయింది.
నిక్కచ్చిగా అబద్ధాలు ...
100 రోజుల పాలనలో ఏపీకి ఏమి తీసుకొచ్చారు అని యాంకర్ అడిగితే ఇంత వరకు రాష్ట్రానికి రాని పెట్టుబడులు వచ్చేసినట్లు అబద్ధాలను కళ్లు మూయకుండా చెప్పుకుంటూ పోయాడు. టీసీఎస్ వచ్చేసిందని, లులు వెనక్కి వస్తోందని, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో 7గిగావాట్ల పెట్టుబడులు, ఫార్మా, ఐటీ, ఎల్రక్టానిక్స్, పెట్రోకెమికల్స్, యూనివర్సిటీలు ఇలా అనేకం ఐదేళ్లలో రాష్ట్రానికి వస్తున్నాయంటూ చెప్పారు. అంతేకాదు విజయవాడ వరదల్లో 40 డ్రోన్లతో 50,000 మందికి ఆహారం సరఫరా చేశామని చెప్పడాన్ని నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఒకరు 59డ్రోన్లు అంటారు మీ కార్యదర్శి 412 డ్రోన్లు అంటారు మీరు 40 అంటున్నారు ఇంతకీ ఏది నిజం అంటూ నిలదీస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా లోకేశ్ మరింతట్రోలింగ్‌కు గురికావడంతో జాతీయ స్థాయిలో తమ నాయకుడు పరువు పోయిందంటూ తెలుగు తమ్ముళ్లు తెగ మధన పడిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment