సాక్షి,ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని, ఏలూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్ చేయబోతోందని దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారి అబ్బయ్య చౌదరి అన్నారు. ఏ ఎగ్జిట్ పోల్స్ చూసినా కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభంజనం సృష్టించబోతోందని స్పష్టం చేశారు.
‘నేషనల్ మీడియా సంస్థలన్నీ కేంద్రానికి భయపడి తల తోక లేని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చాయి. గత ఐదేళ్లలో జగన్మోహన్‌రెడ్డి మంచి చేశారనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ వైసీపీకి అధికారం కట్టబెట్టనున్నారు.
రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరూ పడిన కష్టం ఈనెల 4వ తారీఖున వైఎస్ఆర్‌సీపీ జెండా రెపరెపలాడడంతో ఫలితం దక్కబోతోంది. గతం కంటే కూడా ఈసారి ఎక్కువ మెజార్టీ స్థానాలు రాబోతున్నాయి.
రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో వరుసగా రెండవసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 9వ తేదీన వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment