డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వర్తించే అదికారులు, సిబ్బంది ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా, సూక్ష్మంగా పరిశీలించాలని జేసీ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. జిల్లా కేంద్రంలోని పొదుపు భవన్‌లో మంగళవారం ఎన్నికల మైక్రో అధికారులతో ఆమె సమావేశమయ్యారు.
సాక్షి,సిరిసిల్ల : ఎన్నికల్లో ప్రతీ అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించాలని జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా సూచించారు. స్థానిక పొదుపు భవన్‌లో పోలింగ్ సూక్ష్మస్థాయి అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో జరిగిన ప్రతీ అంశాన్ని మైక్రో పరిశీలకులు నివేదిక రూపంలో అందజేయాలన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు మైక్రో పరిశీలకులు కీలక బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. ఒకరోజు ముందుగానే మైక్రో పరిశీలకులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లి మాక్ పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో నిర్వహించాలన్నారు. మాక్ పోలింగ్‌లో వచ్చిన ఓట్లను ఈవీఎంలతో సరిపోల్చి, ఈవీఎం పనిచేస్తున్న విధానాన్ని ఏజెంట్లకు తెలపాలన్నారు. అన్ని సవ్యంగా ఉంటే ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను సీజ్‌చేయాలని సూచించారు. లోటుపాట్లు ఉంటే ఎన్నికల అధికారులకు నివేదించాలని కోరారు. సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రవత్ కుమార్‌లెంక, ఎల్‌డీఎం రంగారెడ్డి, ఎంఈవో రాంచందర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment