
ఆ పార్టీ అభ్యర్థి అనుమతులు లేకుండా ఆరు వాహనాలు వినియోగించాడు సార్..
మెదక్ అర్బన్: ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా... అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ను అతిక్రమించకుండా పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారులను నియమించింది. ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అభ్యర్థుల నామినేషన్ పత్రాల దాఖలు, పోలింగ్ ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు వెలువరించేంత వరకు బూత్‌లెవల్ అధికారుల నుంచి జిల్లా ఎన్నికల అధికారుల వరకు ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తిస్తారు.
ఏ బాధ్యత రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడే కనిపిస్తున్న ఈ తరుణంలో ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్వర్తించే బాధ్యతలను వివరిస్తూ ప్రత్యేక కథనం....
ప్రిసైడింగ్ అధికారి...
ప్రతి పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్ అధికారి ఉంటారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు ఎన్నికలకు అవసరమైన సామాగ్రిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి తిరిగి వాటిని స్ట్రాంగ్ రూమ్‌కు చేర్చడం వరకు వీరి బాధ్యత. వీరికి సహాయ ప్రిసైడింగ్ అధికారులు అవసరమైన చోట సహాయం అందిస్తుంటారు. పోలింగ్ స్టేషన్‌లో జరిగే అన్ని కార్యక్రమాలు వీరి పర్యవేక్షణలోనే జరుగుతాయి.
సెక్టోరియల్ అధికారి...
నియోజకవర్గాల్లోని 8 నుంచి పది పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించేందుకు సెక్టోరియల్ అధికారులను ఎన్నికల సంఘం నియమిస్తుంది. ఆయా పోలింగ్ బూత్‌లలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవడం వీరి బాధ్యతలు. అక్కడి పరిస్థితులను బట్టి ఆయా చోట్ల 144 సెక్షన్ విధించే అధికారం కలిగి ఉంటారు.
రిటర్నింగ్ అధికారి...
ఎన్నికల నిర్వహణకు కేంద్రం రిటర్నింగ్ అధికారులను నియమిస్తుంది. సంబంధిత నియోజకవర్గాలను పర్యేవేక్షించడం, ఆ పరిధిలోని మండలాల్లో విస్తృతంగా పర్యటించడం, నామినేషన్ల ప్రక్రియ, ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించడం, వారికి శిక్షణ ఇవ్వడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాధారణంగా ఆర్డీఓలకు ఈ బాధ్యతలను అప్పగిస్తారు.
జిల్లా ఎన్నికల అధికారి..
ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ప్రతీ జిల్లాలో ఆ జిల్లా కలెక్టర్ ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించడం, నామినేషన్ ప్రక్రియ, ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం తదితర కార్యక్రమాల్లో ఎన్నికల అధికారి పాత్ర ఎంతో ఉంటుంది.
బూత్ లెవల్ అధికారులు...
కొత్తగా ఓటరు లిస్టులో చేరే వారిని, తొలగింపులు, తప్పుల సవరణకు అవసరమైన ఫారాలు ఇవ్వడం, అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు అయ్యేలా చూడటం, ఓటర్ల జాబితా ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పునకు సహకరించడం వీరి బాధ్యత. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను ప్రతిపాదించడం వంటివి చేస్తుంటారు. వీఆర్‌ఏలు, పంచాయతీ కారోబార్లు, అంగన్‌వాడీ టీచర్లను బూత్‌లెవల్ అధికారులుగా నియమిస్తారు.
కొత్తగా ఓటరు లిస్టులో చేరే వారిని, తొలగింపులు, తప్పుల సవరణకు అవసరమైన ఫారాలు ఇవ్వడం, అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు అయ్యేలా చూడటం, ఓటర్ల జాబితా ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పునకు సహకరించడం వీరి బాధ్యత. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను ప్రతిపాదించడం వంటివి చేస్తుంటారు. వీఆర్‌ఏలు, పంచాయతీ కారోబార్లు, అంగన్‌వాడీ టీచర్లను బూత్‌లెవల్ అధికారులుగా నియమిస్తారు.
పోలింగ్ ఏజెంట్లు...
ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులు పోలింగ్ జరిగే ప్రతీ కేంద్రాన్ని నేరుగా పరిశీలించలేరు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఒక పోలింగ్ ఏజెంట్‌ను నియమించుకోవడానికి అవకాశం ఉంటుంది. పోలింగ్ ఏజెంట్ ఆ కేంద్రంలో ఓటరై ఉండాలి.
ఓటరు నమోదు అధికారి...
ఓటరు నమోదు అధికారి ప్రతీ నియోజకవర్గానికి ఒకరు ఉంటారు. ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా తయారీ వీరి ప్రధాన విధులు, జాబితాలో పేర్లు, చిరునామా, ఫొటోలు, ఏమైనా తప్పులు ఉంటే ఈ అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది.
ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తాం..
ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కాగా అమలు చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో నిమగ్నమై ఉన్నారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాలైన మెదక్, నర్సాపూర్‌లో ఎన్నికలకు సంబంధించి సిబ్బంది నియామకం పూర్తికావచ్చింది. సూక్ష్మపరిశీలకుల నియామకం ఇంకా రెండు మూడు రోజుల్లో జరుగుతుంది. ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది నియామకం ర్యాండమ్ పద్ధతిలో జరిగింది. ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నాం. –నగేశ్, జాయింట్ కలెక్టర్, మెదక్
సూక్ష్మ పరిశీలకులు...
కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికలు జరిగిన తీరు, ఎన్నికల పర్యవేక్షణపై నివేదిక రూపొందించి పంపించేందుకు సూక్ష్మపరిశీలకులను నియమిస్తారు. వీరు ప్రతి మండలానికి ఒకరు మాత్రమే ఉంటారు. వీరంతా ఎన్నికల ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment