సాక్షి, ఢిల్లీ: ఏపీలో టీడీపీ నేతలు అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఏపీలో రాజకీయ హత్యలు, విధ్వంసాలపై వైఎస్సార్‌సీపీ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా గళం విప్పనుంది. ఈ ధర్నాపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో అరాచకం తాండవిస్తోంది. రాష్ట్రంలో 31 హత్యలు జరిగాయి. వెయ్యికిపైగా దాడులు జరిగాయి. 300 మందిపై హత్యాయత్నాలు కూడా చేశారు ఏపీలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యింది. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారు.
.. నిన్న కూడా వైఎస్సార్‌సీపీ నేతపై దాడి జరిగింది. ఏపీలో టీడీపీ నేతలు అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తున్నారు.. ఈ అరాచకాలను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకే ధర్నా చేస్తున్నాం’ అని అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment