![MLC Lella Appi Reddy Fires On Chandrababu Naidu - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/2/MLC-Lella-Appi-Reddy.jpg.webp?itok=HOaw3Tl1)
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మతి తప్పిందని, భ్రమల్లో బతికేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్నీ కూల్చేస్తున్నారని, ప్రాజెక్టులు ఆపేస్తున్నారని, ఏదేదో జరిగి పోతోందని ఒక నెగెటివ్ ఇమాజినేషనన్‌లోకి వెళ్లిపోయారని దుయ్యబట్టారు. ఇలాంటి భ్రమలు, ఆలోచనలు వారి మీద వారికే పట్టు కోల్పోయిన వారికి వస్తాయని చెప్పారు.
అక్రమ కట్టడాలు కూల్చడం తప్పెలా అవుతుందని చంద్రబాబును ప్రశ్నించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి కట్టడాలు నిర్మించకూడదని తెలిసి కూడా తలలో మొదడు ఉన్నవారు ఎవరైనా ప్రజావేదిక పేరుతో అక్రమ కట్టడాలు నిర్మిస్తారా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలో శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఆనాటి టీడీపీ మంత్రి దేవినేని ఉమా చౌదరి కృష్ణా నదిలో బోటు మీద తిరిగి కట్ట మీద ఉన్న వన్నీ అక్రమ కట్టడాలని, తొలగిస్తామని చెప్పారని, ఉమా చెప్పి వదిలేస్తే తాము అధికారంలోకి వచ్చాక తొలిగించామని, ఇది తప్పేలా అవుతుందని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment