
ఫైల్ ఫోటో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై.. ఏపీ సీఐడీ పోలీసులకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై.. ఏపీ సీఐడీ పోలీసులకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్ఫింగ్ కంటెంట్‌తో విద్వేషపూరితమైన ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా దుష్ప్రచారం చేస్తున్న వారిపై.. చర్యలు తీసుకోవాలని సీఐడీ పోలీసులను లేళ్ల అప్పిరెడ్డి కోరారు. టీడీపీ పొలిటికల్ వింగ్, టీడీపీ యాక్టివిస్ట్, రాజ్‌బొడ వంటి పేజ్‌లపై చర్యలు తీసుకోవాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు.