
సాక్షి,తాడేపల్లి : రాక్షస ఎల్లోమీడియా, అనైతిక సోషల్ మీడియాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధంలో కచ్చితంగా న్యాయమే గెలుస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
‘మేము రాక్షస ఎల్లోమీడియా, అనైతిక సోషల్ మీడియాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్దంలో మా కార్యకర్తలపై నిత్యం అక్రమ కేసులు, వేధింపులు, నిర్బంధాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో మా ప్రతి సైనికుడికి నేను అండగా నిలుస్తా. కచ్చితంగా న్యాయం గెలుస్తుంది’ అని వైఎస్ జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగ పాలన ‘దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకాన్ని’ తలపిస్తోంది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్న వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, పార్టీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వం అడ్డూ, అదుపు లేకుండా వేధింపులకు గురి చేస్తుంది. ఈ తరుణంలో కార్యకర్తలకు అండగా నిలుస్తూ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు వైఎస్ జగన్.
We are waging a war against a demonic yellow media and it’s unethical social media. In this battle illegal detentions, undue harassment and false cases are the order of the day . I am with you in each of these battles, truth alone shall prevail.#WeStandForTruth… pic.twitter.com/dfTbNEO1Hi
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 8, 2024
