సాక్షి, తాడేపల్లి : అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.1150 కోట్లు కేటాయించడం పట్ల బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ కో ఆర్డీనేటర్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లిలో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం లేళ్ళ అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ సంస్థలు మోసం చేస్తే ప్రభుత్వం డబ్బులు చెల్లించిన దాఖలాలు ఎక్కడ లేవన్నారు. కానీ సీఎం జగన్ మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకుంటున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా బాధితులకు చెక్కులు ఇప్పించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చంద్రబాబు హయంలోనే ఇసుకు కుంభకోణం జరిగిందని ఆరోపించారు. తిన్నది అరక్క లోకేష్ రేపు గుంటూరులో దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్‌ను విచారిస్తే ఏయే నదుల్లో ఎంత కుంభకోణం జరిగిందో బయటపడుతుందన్నారు. లోకేష్ నాయకత్వంలో గత ఐదేళ్లలో వేలకోట్ల రూపాయల ఇసుక దోపిడి జరిగిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment