వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ నుంచి వైఎస్సార్‌సీపీకి సర్టిఫికెట్ | Wonder Book Of Records Certificate To YSRCP Over Blood Donation | Sakshi
Sakshi News home page

వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ నుంచి వైఎస్సార్‌సీపీకి సర్టిఫికెట్

Published Tue, Jan 5 2021 6:57 PM | Last Updated on Tue, Jan 5 2021 8:47 PM

Wonder Book Of Records Certificate To YSRCP Over Blood Donation - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహించిన రక్తదానం రికార్డులకెక్కింది. ఈ మేరకు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి సర్టిఫికెట్‌ అందింది. మంగళవారం ఈ సర్టిఫికెట్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌  కార్పొరేషన్‌ చైర్మన్‌ మధుసూధన్‌రెడ్డి, ఆప్కో చైర్మన్‌ చిల్లపల్లితో కలిసి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు. చదవండి: (రక్తం పంచిన అభిమానం)

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం జగన్‌ జన్మదినం సందర్భంగా చేసిన రక్తదానం రికార్డులకెక్కింది. మేము రికార్డుల కోసం పనిచేయలేదు. కోవిడ్‌ సమయంలో రక్తం కొరత దృష్టిలో ఉంచుకొని ఓ మంచి పనిని చేపట్టాం. పార్టీ కార్యకర్తలుగా మాకు గర్వంగా ఉంది. ఈ రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు మేము రక్తం అందిస్తున్నాం. భవిష్యత్తులో ప్రజల కోసం మరిన్ని సేవా కార్యాక్రమాలు చేస్తాం' అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement