సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై ఈడీ ప్రకటన చేసింది. సాయంత్రం 5.20 గంటలకు అరెస్ట్ చేశామని, మనీలాండరింగ్ యాక్ట్ కింద కవితను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. కవితను అరెస్ట్ చేసినట్లు ఆమె భర్తకు సమాచారం ఇచ్చామని ఈడీ అధికారులు తెలిపారు.
రేపు ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ రోజు రాత్రంత ఢిల్లీ ఈడీ కార్యాలయంలోనే కవిత ఉండనున్నారు. కాగా, తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం.
మరోవైపు, కవిత భర్త అనిల్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనని అరెస్ట్ చేశారని కవిత ఆరోపించారు. న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment