న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజకీయ నేతల పేర్లతో ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపలేమని స్పష్టం చేసింది.
ఒకే నియోజకవర్గంలో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు పోటీచేయకుండా అనుమతించాలని కోరుతూ పిటిషనర్ సాబు స్టీఫెన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కీల స్థానాల్లో ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు డూప్లికేట్ అభ్యర్ధులు ఇలా చేస్తున్నారని, ఎక్కువ సంఖ్యలో ఒకే పేరుతో ఉన్న స్వతంత్రులు పోటీ చేయడం వల్ల పేరున్న రాజకీయ నేతలు స్వల్ప తేడాతో ఎన్నికల్లో ఓడిపోతున్నారని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతమైన ఎన్నికల ప్రక్రియ కోసం ఈ ధోరణిని ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.
ఈ పిటిషన్ ను పరిశఋలించిన జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం.. దీనిపై విచారణకు నిరాకరించింది. ‘తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆ రకమైన పేర్లను పెట్టినప్పుడు ఎన్నికల్లో పోటీకి అదెలా అడ్డంకి అవుతుంది? ఒకవేళ రాహుల్‌గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి పేర్లు పెట్టుకుంటే వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలా అడ్డుకుంటాం?అది వాళ్ల హక్కులను ఉల్లంఘించినట్లు కాదా?’ అని ప్రశ్నించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు కోర్టు అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment