ప్రధాని మోదీపై పిటిషన్‌... తిరస్కరించిన సుప్రీంకోర్టు | Supreme Court Declines Petition To Ban Pm Modi From Elections | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీపై పిటిషన్‌... తిరస్కరించిన సుప్రీంకోర్టు

May 14 2024 4:11 PM | Updated on May 14 2024 4:22 PM

Supreme Court Declines Petition To Ban Pm Modi From Elections

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని ఆరోపిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ మోదీని ఎన్నికల నుంచి నిషేధం విధించాలని ఓ మహిళ న్యాయవాది ఆనంద్ ఎస్ జోంధాలే ద్వారా పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేసేందుకు సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు.  

అయితే న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ఎస్సీ శర్మలతో కూడిన ధర్మాసనం ఫిర్యాదును పరిష్కరించేందుకు సంబంధిత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని పిటిషనర్‌ను కోరింది.

మీరు అధికారులను సంప్రదించారా.? మాండమస్ రిట్ కోసం మీరు ముందుగా అధికారులను సంప్రదించాలి అని ధర్మాసనం పేర్కొంది. అయితే పిటిషనర్ ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement