భిక్కనూరులో మాట్లాడుతున్న జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్
సాక్షి, భిక్కనూరు: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ఆదివా రం మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఎంపీ మాట్లా డుతూ కారు స్పీడ్ మీదుంది.. అడ్డగించడం కూటమి తరం కాదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా పథకం పథకాలు ప్రపంచ వ్యాప్తంగా పేరొందాయని, ఐక్యరాజ్యసమితి కూడా రైతుబీమా పథకం బేషుగ్గా ఉందని కితాబు ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ పథకాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందితే కూటమి నేతలకు అవి కనిపించడం లేదన్నారు.
భారీగా కదలి వచ్చిన ప్రజలు
మండల కేంద్రలో టీఆర్‌ఎస్ నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు భారీగా తరలివచ్చారు. భిక్కనూరు దళితవాడలో ప్రారంభమైన రోడ్ షో మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. దారి పొడవునా మహళలు గంప గోవర్ధన్‌కు మంగళహారతులతో స్వాగతం పలికారు. మండల కేంద్రానికి చెందని వ్యాపారీ నర్‌పత్‌సింగ్ తన కారుపై పెద్ద బతుకమ్మను పెట్టి రోడ్ షోలో పాల్గోనడం పలువురిని ఆకర్షించింది. టీఆర్‌ఎస్ నేతలు నంద రమేష్, సుదర్శన్, అమృత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, నర్సింహరెడ్డి, బండి రాములు, గంగళ్ల భూమయ్య, పాల రాంచంద్రం, దుర్గారెడ్డి, వెంకట్‌రెడ్డి, వంగేటి చిన్ననర్సరెడ్డి, బల్వంత్‌రావు, కమలాకర్, డాక్టర్ సత్యనారాయణ, తున్కి వేణు, సంజీవరెడ్డి, భగవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment