
సాక్షి,అమరావతి: సీఎం వైఎస్ జగన్ గురువారం కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటిస్తారు. గుడివాడ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. గురువారం ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయల్దేరి 11.30–11.50 గంటల మధ్య గుడివాడ మున్సిపల్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు.