
అవి కేవలం ఆలయాలు కాదు.. అనాది కాలపు ఆనవాళ్లు. అవి కేవలం విగ్రహాలు కావు.. ఘన సాంస్కృతిక చరితకు సాక్ష్యాలు. ఆ గాలుల్లో పంచాక్షర మంత్రాలు ప్రతిధ్వనిస్తుంటాయి. ఆ నీళ్లలో పంచామృత ధారలు కలిసి ప్రవహిస్తుంటాయి. ఆ మట్టి రేణువుల్లో మహాదేవుడి ప్రతిబింబాలు కనిపిస్తుంటాయి. ఈ శివరాత్రికి ఆ కథలు తెలుసుకుందాం. జాగరణ క్రతువులో మన కోవెల కథలు పారాయణంగా చెప్పుకుందాం.
కలియుగ కైలాసం
పైకప్పు లేని శైవక్షేత్రం, ప్రపంచంలోనే ఎత్తైన స్వయం భూలింగం, అత్యంత ప్రాచీన సుమేరు పర్వతం.. కలగలిపి రావివలస ఎండల మల్లన్న క్షేత్రం. శివరాత్రి నుంచి మొదలుకుని మూడు రోజుల పాటు ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ కార్య నిర్వహణాధికారి జి.గురునాథరావు పర్యవేక్షణలో ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, లింగోద్భవం కార్యక్రమాలు నిర్వహిస్తారు. 27 గురువారం నిత్య అర్చనలతో పాటు మల్లన్నకు విభూది భష్మాలంకరణ పూజలు చేయనున్నారు. 28 శుక్రవారం స్వామి వారి తిరువీధి, చక్రతీర్థ స్నానాలు నిర్వహిస్తారు.
చేరుకునే మార్గాలివే..
ఎండల మల్లన్న ఆలయానికి రోడ్డు, రైల్వే మా ర్గాలు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి టెక్కలి చేరుకుంటే.. అక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆలయానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు ఉంటాయి. రైల్వే మార్గం విషయానికి వస్తే టెక్కలితో పాటు సమీపంలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో నౌపడ రైల్వే స్టేషన్, 20 కిలోమీటర్ల దూరంలో పలాస రైల్వే స్టేషన్‌కు రైల్వే మా ర్గంలో చేరుకుని అక్కడి నుంచి చిన్నపాటి వాహనాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. – టెక్కలి
బ్రహ్మసూత్ర శివలింగాలు
శ్రీముఖలింగం దక్షిణ కాశీగా ఎప్పటి నుంచో ఖ్యాతి పొందింది. ఇక్కడ అరుదైన బ్రహ్మసూత్ర శివలింగాలు ఐదు ఒకే చోట కొలువై ఉన్నాయి. బ్రహ్మజ్ఞాన తత్పరులైన మహర్షులు స్థాపించి నిత్య పూజలందుకునే శివలింగాలను బ్రహ్మసూత్ర శివలింగాలు అంటారు. భీమేశ్వర, సోమేశ్వర, వరుణేశ్వర, ఈశాన్య ఈశ్వర, ఎండల మల్లికార్జున లింగాలు ఇక్కడ దర్శనమిస్తా యి. దేశం మొత్తం మీద ఇలాంటివి చాలా అరుదు. శ్రీముఖలింగంలో ముఖాకృతిలో లింగం దర్శనం ఇవ్వడం ప్రత్యేకత.
ఇక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. కృతయగంలో గోవిందేశ్వరుడు అనే నామంతో కనాకాకృతిలోను, త్రేతాయగంలో మధుకేశ్వరుడనే నామంతో రజతాకృతి లోను, ద్వాపర యగంలో జయంతేశ్వరుడనే నామంతో కాంస్యాకృతిలోను, కలియగంలో ముఖలింగేశ్వరుడనే పేరుతో ముఖం దాల్చి శిలాకృతిలో శివుడు శ్రీముఖలింగం క్షేత్రంలో దర్శనమిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి శ్రీముఖలింగానికి రవాణా సదుపాయం ఉంది.
–జలుమూరు
బలరామ ప్రతిష్టితం
శ్రీకాకుళం కల్చరల్: పవిత్ర నాగావళి తీరం, పురాతన ఆలయ నిర్మాణం, బలరామ ప్రతిష్టిత శివలింగం.. వెరసి ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయం. ద్వాపర యుగాంతంలో నిర్మితమైన ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. బలరామ ప్రతిష్టితములైన పంచలింగాల ప్రాంతం కావడంతో పంచలింగ క్షేత్రంగానూ పరిఢవిల్లుతోంది. ఆలయంలో ఉత్స వాలకు అర్చకులు శ్రీరామమూర్తి, ఈఓ సర్వేశ్వరరావు ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి రోజున రాత్రి 12గంటలకు లింగోద్భవ పూజలు జరుగు తాయని, తెల్లవారు 3గంటలకు స్వామివారి ఊరేగింపు నందివాహనంపై ఉంటుందని తెలిపారు.
బావిలోని విగ్రహాలు బయటకు తీసి..
శ్రీకాకుళం గుజరాతీపేటలో ఉన్న ఉమా లక్ష్మేశ్వర స్వామి ఆలయం కూడా అతిపురాతనమైనది. 300 ఏళ్ల కిందట మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక స్వామీజీ నాగావళి నది పొంగి ఉండగా ఇక్కడ బస చేశారు. ఆ సమయంలోనదీ ప్రాంగణంలోని ఒక నూతిలో ముస్లింరాజు పారేసిన విగ్రహాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. అందులో విగ్రహాలు బయటకు తీసి జీరో్ణద్ధరణ చేశారు. ఆ తర్వాత ఆలయాన్ని సుందరంగా నిర్మించి అర్చనాదులు నిర్వహిస్తున్నారు.
భక్తుల కొంగు బంగారం
శ్రీకాకుళం నక్కవీధిలోని ఉమాజఠలేశ్వర స్వామి ఆలయం ఉంది. భస్మాంగుల వంశస్తులు ఈ ఆలయాన్ని నెలకొలి్పనట్లు చరిత్ర చెబుతోంది. శివరాత్రి పర్వదినం రోజున ఏకాహం, లింగోద్భవ కాలంలో లింగాభరణం నిర్వహిస్తారు.
250 ఏళ్లుగా..
శ్రీకాకుళంలోని కొన్నావీధిలో భీమేశ్వరుడు 250 ఏళ్లుగా పూజలు అందుకుంటున్నాడు. లోతైన గర్భగుడి, పెద్ద శివలింగం, లింగంపై నాటి ధారాపాత్ర.. వంటివి ఇక్కడి ప్రత్యేకతలు. శివరాత్రి నాడు ఉదయం నుంచి రుద్రాభిõÙకాలు, క్షీరాభిషేకాలు ఉంటాయని ఆలయ ఈఓ మాధవి, అర్చకులు గంట చిన్న రామ్మూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment