Top 10 Telugu Movies To Watch on Maha Shivaratri - Sakshi
Sakshi News home page

Maha Shivaratri Movies: శివరాత్రికి ఈ సినిమాలు చూస్తూ జాగారం చేసేయండి..

Published Fri, Feb 17 2023 3:01 PM | Last Updated on Fri, Feb 17 2023 3:35 PM

Top 10 Telugu Movies To Watch on Maha Shivaratri - Sakshi

మహా శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ముక్కంటి నామస్మరణతో ఆలయాలు మార్మోగుతాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంతోమంది భక్తులు ఉపవాసం, జాగరణ చేస్తూ ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో సాంబశివుడిని పూజిస్తారు. రోజంతా ఆయన నామస్మరణలోనే మునిగి తేలుతుంటారు.

మరి అంతటి పవిత్రమైన రోజు మీలో భక్తిపారవశ్యాన్ని మరింత పెంపొందించే సినిమాలు చూడకపోతే ఆరోజు పరిపూర్ణం ఎలా అవుతుంది? పైగా నిద్ర పోకుండా జాగరణ చేసేందుకు చాలా మంది సినిమాలను ఎంచుకుంటారు. కాబట్టి ఈ శివరాత్రికి శివయ్య మీద భక్తిని పెంపొందించే సినిమాలేంటో ఓసారి చూసేయండి..

1. కాళహస్తి మహత్యం
2. శివలీలలు
3. భక్త మార్కండేయ
4. దక్షయజ్ఞం
5. శివకన్య
6. భక్త కన్నప్ప
7. ఉమాచండీ గౌరీశంకరుల కథ
8. మావూళ్లో మహాశివుడు
9. మహాశివరాత్రి
10. శ్రీ మంజునాథ

ఇవే కాకుండా శివరాత్రి మహత్యం, భూకైలాస్‌, అంజి, కార్తికేయ వంటి మరెన్నో చిత్రాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చినవాటిని సెలక్ట్‌ చేసుకుని వాటిని చూస్తూ జాగారం చేసేయండి..

చదవండి: థియేటర్స్‌లో సూపర్‌ హిట్‌.. మళ్లీ రీరిలీజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement