Sri Manjunatha Movie Makers
-
మహా శివరాత్రికి తప్పక చూడాల్సిన సినిమాలు!
మహా శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ముక్కంటి నామస్మరణతో ఆలయాలు మార్మోగుతాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంతోమంది భక్తులు ఉపవాసం, జాగరణ చేస్తూ ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో సాంబశివుడిని పూజిస్తారు. రోజంతా ఆయన నామస్మరణలోనే మునిగి తేలుతుంటారు. మరి అంతటి పవిత్రమైన రోజు మీలో భక్తిపారవశ్యాన్ని మరింత పెంపొందించే సినిమాలు చూడకపోతే ఆరోజు పరిపూర్ణం ఎలా అవుతుంది? పైగా నిద్ర పోకుండా జాగరణ చేసేందుకు చాలా మంది సినిమాలను ఎంచుకుంటారు. కాబట్టి ఈ శివరాత్రికి శివయ్య మీద భక్తిని పెంపొందించే సినిమాలేంటో ఓసారి చూసేయండి.. 1. కాళహస్తి మహత్యం 2. శివలీలలు 3. భక్త మార్కండేయ 4. దక్షయజ్ఞం 5. శివకన్య 6. భక్త కన్నప్ప 7. ఉమాచండీ గౌరీశంకరుల కథ 8. మావూళ్లో మహాశివుడు 9. మహాశివరాత్రి 10. శ్రీ మంజునాథ ఇవే కాకుండా శివరాత్రి మహత్యం, భూకైలాస్, అంజి, కార్తికేయ వంటి మరెన్నో చిత్రాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చినవాటిని సెలక్ట్ చేసుకుని వాటిని చూస్తూ జాగారం చేసేయండి.. చదవండి: థియేటర్స్లో సూపర్ హిట్.. మళ్లీ రీరిలీజ్ -
ఆఖరి బస్సులో ఏం జరిగింది?
లంబసింగి నుంచి అరకు వెళ్లే ఆఖరి బస్సులో ఏం జరిగిందనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘లాస్ట్ బస్’. కన్నడంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో ‘అడవిలో లాస్ట్ బస్’ పేరుతో విడుదల చేస్తున్నారు. అవినాష్, నరసింహరాజు, మేఘశ్రీ, ప్రకాశ్, మానస జోషి, రాజేష్ ప్రధాన పాత్రలు పోషించారు. పూజశ్రీ సమర్పణలో ఈ నెల 27న శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. పూజశ్రీ మాట్లాడుతూ- ‘‘ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రమిది. కొత్త సినిమా చూశామనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది. చిత్ర దర్శకుడు అరవింద్ పాటలు కూడా స్వరపరచడం మరో విశేషం. ఈ చిత్రంలోని ఓ పాట బీబీసీ ఛానెల్లో ప్రసారమైంది. రాకేందు మౌళి వెన్నెలకంటి రాసిన రెండు పాటలు, నందు తుర్లపాటి సంభాషణలు హైలెట్గా నిలుస్తాయి. డబ్బింగ్, అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అని చెప్పారు.