ఆఖరి బస్సులో ఏం జరిగింది? | Last Bus Sri Manjunatha Movie Makers | Sakshi
Sakshi News home page

ఆఖరి బస్సులో ఏం జరిగింది?

Published Mon, May 16 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

ఆఖరి బస్సులో ఏం జరిగింది?

ఆఖరి బస్సులో ఏం జరిగింది?

లంబసింగి నుంచి అరకు వెళ్లే ఆఖరి బస్సులో ఏం జరిగిందనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘లాస్ట్ బస్’. కన్నడంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో ‘అడవిలో లాస్ట్ బస్’ పేరుతో విడుదల చేస్తున్నారు. అవినాష్, నరసింహరాజు, మేఘశ్రీ, ప్రకాశ్, మానస జోషి, రాజేష్ ప్రధాన  పాత్రలు పోషించారు. పూజశ్రీ సమర్పణలో ఈ నెల 27న శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. పూజశ్రీ మాట్లాడుతూ- ‘‘ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. కొత్త సినిమా చూశామనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది.

చిత్ర దర్శకుడు అరవింద్ పాటలు కూడా స్వరపరచడం మరో విశేషం. ఈ చిత్రంలోని ఓ పాట బీబీసీ ఛానెల్‌లో ప్రసారమైంది. రాకేందు మౌళి వెన్నెలకంటి రాసిన రెండు పాటలు, నందు తుర్లపాటి సంభాషణలు హైలెట్‌గా నిలుస్తాయి. డబ్బింగ్, అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement