హైదరాబాద్: మహా శివరాత్రి పురస్కరించుకుని ప్రత్యేక బస్సులను నడపడానికి టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. తెలంగాణ నుంచి 2427 ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. శ్రీశైలానికి 578, ఏడుపాయలకు 497, వేములవాడకు 481 బస్సులు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవ క్షేత్రాలకు సర్వీసులు నడపనుంది. ఈ మేరకు భక్తులకు ఇబ్బంది కలగ్గకుండా టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్ నుంచి పత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సు సర్వీస్‌లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పించింది.
“మహారాత్రి శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని 40 ప్రముఖ శైవాలయాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించాం. రద్దీకి అనుగుణంగా మరిన్ని పత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. భక్తులు ఈ ప్రత్యేక సర్వీస్‌లను ఉపయోగించుకుని క్షేమంగా శైవాలయాలకు చేరుకొని.. మొక్కులు చెల్లించుకోవాలి.” అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ , సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, కోరారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహాశివరాత్రికి ఈ అద్దె బస్సు సౌకర్యాన్ని భక్తులు ఉపయోగించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment