shiva ratri
-
Mahakumbh: మహాశివరాత్రికి చివరి పవిత్ర స్నానం.. సన్నాహాలివే..
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ముగింపుదశకు చేరింది. మహాశివరాత్రి(ఫిబ్రవరి 26)తో ఈ మహోత్సవం ముగియనుంది. ఈ నేపధ్యంలో త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. శివరాత్రి రోజున మహాకుంభమేళాలో చివరి పవిత్ర స్నానాలు జరగనుండటంతో అధికారులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.మహాశివరాత్రి(Mahashivratri) రోజున ఇక్కడికి తరలివస్తున్న భక్తులందరికీ పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించే దిశగా అధికారులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భారీగా భక్తులు తరలివస్తున్న నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు చేరే అన్నిమార్గాల్లో ట్రాఫిక్‌జామ్ నెలకొంటోంది. దీనిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనం పెద్ద సంఖ్యలో రైళ్లలో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు.మహా కుంభమేళా(Mahakumbh) దృష్ట్యా ప్రతిరోజూ 80 నుండి 100 రైళ్లను రైల్వేశాఖ ప్రయాగ్‌రాజ్ మీదుగా నడుపుతోంది. ఇప్పుడు మహాశివరాత్రిని దృష్టిలో ఉంచుకుని, ఫిబ్రవరి 26న 200 కి పైగా కుంభమేళా ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లలో 18 నుండి 20 కోచ్‌లు ఉంటాయి. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా 50 కి పైగా సాధారణ రైళ్లను రద్దు చేశారు. మహా కుంభమేళా సమయంలో భక్తుల కోసం 14 వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి.శనివారం (ఫిబ్రవరి 22) వరకు 60 కోట్లకు పైగా భక్తులు మహా కుంభ స్నానం చేశారని డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. మహాశివరాత్రిని దృష్టిలో ఉంచుకుని మహాకుంభమేళా ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారని, సంగమ ప్రాంతానికి వచ్చే భక్తులు సురక్షితంగా స్నానం చేసి, వారి గమ్యస్థానానికి చేరుకునేలా పర్యవేక్షించేందుకు పలువురు అధికారులు ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్లులు ప్రయాగ్‌రాజ్‌కు ఏ మార్గం నుండి వచ్చినా, దానికి సమీపంలోని పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారని వైభవ్ కృష్ణ తెలిపారు. ఇది కూడా చదవండి: Mahakumbh: వామ్మో.. ఈ రైళ్లు ఇంతలేటా.. ఇక కుంభమేళాకు వెళ్లినట్లే! -
హరహర మహాదేవ... రాజన్నను దర్శించుకున్న 3 లక్షల మంది భక్తులు
వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజన్న క్షేత్రం శివనామస్మరణతో మారుమోగింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని రాజన్న దర్శనానికి దాదాపు 3 లక్షల మంది వరకు వేములవాడకు తరలివచ్చారు. ఒక్కోభక్తుడి దర్శనానికి దాదాపు పది గంటల సమయం పట్టింది. శివమాలాధారులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. సాయంత్రం 6 గంటల నుంచి నిరంతరం లఘు దర్శనాలకు అవకాశం కల్పించారు. ఉదయం వేళలో మధ్య మధ్యలో దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆర్జిత సేవలు రద్దు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లలో భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎసీపీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్లు ఖీమ్యానాయక్, సత్యప్రసాద్, ఏఎస్పీ చంద్రయ్య, తహసీల్దార్ రాజారెడ్డి పరిశీలించారు. రాజన్నకు వెంకన్న పట్టువస్త్రాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్నకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలను డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ బృందం సమర్పించారు. వీరికి ఆలయ ఈవో కృష్ణప్రసాద్ ప్రసాదాలు అందించి, సత్కరించారు. రూ.50 కోట్లతో అభివృద్ధి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వేములవాడ, సిరిసిల్ల పట్టణాలను రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. హాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, అడిషనల్ కలెక్టర్లు ఖీమ్యానాయక్, సత్యప్రసాద్ స్వాగతం పలికారు. రాజన్న దర్శనం అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వేములవాడపై ప్రత్యేక దృష్టి పెట్టారని, రాష్ట్రంలోనే ఎములాడ రాజన్న ఆదాయంలో నంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. గుడి చెరువు, ధర్మ గుండంలను ఎల్లప్పుడు గోదావరి జలాలతో నింపుతామన్నారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థఫు మాధవి, కౌన్సిలర్లు ఉన్నారు. మార్మోగిన ఆలయాలు కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్ పట్టణంతో పాటు జిల్యావ్యాప్తంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. కరీంనగర్ పాతబజారులోని శివాలయం, కమాన్ వద్ద రామేశ్వరాలయంలో స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులుతీరారు. ► శుక్రవారం అర్ధరాత్రి 12 నుంచి శనివారం వేకువజాము 3.30 గంటలు: స్థానికుల దర్శనాల అనంతరం నిరంతరం లఘు దర్శనాల కొనసాగింపు. ► శనివారం ఉదయం 7 గంటలు: టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఆధ్వర్యంలో రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. ► ఉదయం 8: రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ దంపతులు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పట్టువస్త్రాలు సమర్పించారు. ► మధ్యాహ్నం 3.30: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజన్నను దర్శించుకున్నారు. ► సాయంత్రం 4: శివమాలధారులు రాజన్నను దర్శించుకున్నారు. ► సాయంత్రం 6: అద్దాల మండపంలో అనువంశిక అర్చకుల ఆధ్వర్యం లో సామూహిక మహాలింగార్చన. ► సాయంత్రం 6 నుంచి ..: రాష్ట్ర భాషా, సాంస్కృతికశాఖ జాయింట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో శివార్చన. ► రాత్రి 11.35 నుంచి ఉదయం 4 గంటలు: లింగోద్భవ సమయంలో రాజన్నకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. సేవలు ఇలా.. ► రాజన్న మహాజాతరలో 2 వేల మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు. ► 650 మంది శానిటేషన్ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు విధులకు హాజరయ్యారు. ► ఎంపీవోలు 80 మంది, మెడికల్ సిబ్బంది 300, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ 150, అంగన్వాడీలు 150, స్వచ్ఛంద సంస్థ సభ్యులు వెయ్యి మంది జాతరలో విధులు నిర్వహించారు. ► ఆలయ సిబ్బంది 850, సెస్ ఉద్యోగులు 90, ఎక్సైజ్ 75 మంది విధులకు హాజరయ్యారు. ► 800 బస్సుల్లో భక్తులను వివిధ ప్రాంతాలకు చేరవేశారు. ► 14 ఉచిత బస్సులు తిప్పాపూర్ నుంచి రాజన్న ఆలయానికి భక్తులను ఉచితంగా చేరవేశాయి. చదవండి: ఊరూవాడా శివనామ స్మరణ -
రాజన్న దర్శనం కోసం వేములవాడకు పోటెత్తిన భక్తులు
వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ హరహర మహాదేవ నామస్మరణతో మారుమోగుతోంది. శివమాలధారులు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆధ్యాత్మిక క్షేత్రం కిక్కిరిసిపోతోంది. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాజాతరకు నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే గుడారాలు వేసుకుంటున్నారు. ధర్మగుండంలోకి అనుమతి లేకపోవడంతో షవర్ల వద్ద స్నానాలు చేస్తున్నారు. గుడి ఆవరణలో జాగరణ కోసం భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసిన ఆలయ అధికారులు లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రూ.3.70 కోట్లతో జాతర ఏర్పాట్లు చేశారు. రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో శివార్చనలో భాగంగా 1,600 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాస్‌ల జారీ విషయంలో ఉద్యోగులు, పురప్రముఖులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి జాతరకు 3 లక్షల వరకు భక్తులు వస్తారని అధికారుల అంచనా. స్వామి మహామంటపంలో ఉత్సవమూర్తులను సిద్ధం చేసి ఉంచారు. అన్నదానం ప్రారంభం జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులు, పోలీసు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి స్థానిక వాసవీ సేవా సమితి, మన చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రమేశ్‌బాబు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఈవో కృష్ణప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ అన్నదానం శని, ఆదివారాలు సైతం కొనసాగుతుందని నిర్వాహకులు మోటూరి మధు, కొమ్మ నటరాజ్ తెలిపారు. దాదాపు 30 వేల మందికి అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. ఉచిత బస్సు సేవలు దేవస్థానం తరఫున 14 ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ఈ సేవలను శుక్రవారం ప్రారంభించారు. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి బైపాస్‌రోడ్డు గుండా జగిత్యాల బస్టాండు, గుడిప్రాంతం, బైపాస్‌రోడ్డు ద్వారా కోరుట్లబస్టాండు, ప్రాంతాలను కలుపుతూ తిరిగి తిప్పాపూర్ బస్టాండ్ వరకు చేరుకుంటాయి. భక్తుల రద్దీని బట్టి బస్సులను తింపనున్నట్లు డీఎం మురళీకృష్ణ తెలిపారు. ప్యూరిఫైడ్ వాటర్ మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఆలయ ఈవో కార్యాలయం వద్ద, గుడి పక్కన పార్కింగ్ ఏరియా, బద్దిపోచమ్మ గుడి వద్ద రాజన్న జలప్రసాదం మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాట్లు చేశారు. రాత్రి సమయంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్ బాబు తదితరులు శివార్చన ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. చదవండి: శివ నామస్మరణతో మార్మోగుతున్న తెలుగు రాష్ట్రాలు -
మహా శివరాత్రికి 2,427 ప్రత్యేక బస్సులు: టీఎస్ఆర్టీసీ
హైదరాబాద్: మహా శివరాత్రి పురస్కరించుకుని ప్రత్యేక బస్సులను నడపడానికి టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. తెలంగాణ నుంచి 2427 ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. శ్రీశైలానికి 578, ఏడుపాయలకు 497, వేములవాడకు 481 బస్సులు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవ క్షేత్రాలకు సర్వీసులు నడపనుంది. ఈ మేరకు భక్తులకు ఇబ్బంది కలగ్గకుండా టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ నుంచి పత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సు సర్వీస్‌లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించింది. “మహారాత్రి శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని 40 ప్రముఖ శైవాలయాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించాం. రద్దీకి అనుగుణంగా మరిన్ని పత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. భక్తులు ఈ ప్రత్యేక సర్వీస్‌లను ఉపయోగించుకుని క్షేమంగా శైవాలయాలకు చేరుకొని.. మొక్కులు చెల్లించుకోవాలి.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ , సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, కోరారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహాశివరాత్రికి ఈ అద్దె బస్సు సౌకర్యాన్ని భక్తులు ఉపయోగించుకోవాలని సూచించారు. -
పంచారామ క్షేత్రాలు
పంచారామ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఈ క్షేత్రాల పుట్టుక గురించి వేర్వేరు పురాణాల్లో వేర్వేరు గాథలు ఉన్నాయి. శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణంలో ఉన్న కథ ఏమిటంటే– క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతం పంపిణీలో జగన్మోహిని రూపంలో మహావిష్ణువు తమకు చేసిన అన్యాయానికి అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురాసురుల నాయకత్వంలో తపస్సు చేసి, శివుణ్ణి మెప్పించి వరాలు పొందారు. వర గర్వంతో వారంతా దేవతలపై తరచు దాడులు సాగిస్తూ, నానా యాతన పెడుతుండటంతో దేవతలంతా కలసి రాక్షసులకు వరాలు ఇచ్చిన శివుణ్ణే శరణు వేడుకున్నారు. దేవతలపై జాలిపడిన శివుడు తన పాశుపతాస్త్రంతో త్రిపురాసుర సంహారం చేశాడు. పాశుపతం ధాటికి త్రిపురాసురుల రాజ్యమంతా భస్మీపటలమైనా, వారు పూజిస్తూ వచ్చిన పెద్దశివలింగం మాత్రం చెక్కుచెదరలేదు. శివుడు ఈ లింగాన్ని ఐదు ముక్కలుగా ఛేదించి, వేర్వేరు చోట్ల ప్రతిష్ఠించడానికి దేవతలకు ఇచ్చాడు. దేవతలు వీటిని ప్రతిష్ఠించిన క్షేత్రాలే పంచారామ క్షేత్రాలు. తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం (దక్షారామం), సామర్లకోటలోన కుమారారామం, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో క్షీరారామం, భీమవరంలో సోమారామం, గుంటూరు జిల్లా అమరావతిలో అమరారామం పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. పంచారామ క్షేత్రాల పుట్టుక గురించి స్కాందపురాణంలో మరో కథ ఉంది. అదేమిటంటే– తారకాసురుడనే రాక్షసుడు ఘోరతపస్సు చేసి, శివుడిని మెప్పించి, ఆయన నుంచి ఆత్మలింగాన్ని పొందాడు. బాలకుడి చేత తప్ప ఇంకెవ్వరి చేత తన మరణం ఉండరాదనే వరం పొందాడు. వరగర్వంతో తారకాసురుడు దేవతలను ముప్పుతిప్పలు పెట్టసాగాడు. దేవతలంతా శివపార్వతులను దర్శించుకుని, తారకాసురుణ్ణి సంహరించగల బాలుడిని తమకు అనుగ్రహించమని ప్రార్థించారు. శివపార్వతులకు జన్మించిన కుమారస్వామి దేవతల సైన్యానికి నాయకత్వం వహించి, తారకాసురుణ్ణి సంహరించాడు. తారకాసురుడు నేలకూలడంతో అతడి గొంతులోని ఆత్మలింగం ఐదుముక్కలైంది. దేవతలు వాటిని ఐదుచోట్ల ప్రతిష్ఠించారు. పంచారామాల్లోని అమరావతిలో ఉన్న శివలింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ద్రాక్షారామంలో దక్షుడు తపస్సు చేశాడని, ఇక్కడ వెలసిన శివలింగానికి సూర్యభగవానుడు తొలి అభిషేకం చేశాడని పురాణాల కథనం. భీమవరంలోని సోమారామంలో శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది. సామర్లకోటలోని కుమారభీమారామంలో భీమేశ్వర ఆలయాన్ని చాళుక్య భీముడు నిర్మించాడు. పాలకొల్లులోని క్షీరారామ క్షేత్రంలో శివలింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. విదేశాల్లో శివాలయాలు నేపాల్‌లోని పశుపతినాథ క్షేత్రమే కాకుండా, భారత్‌కు వెలుపల వివిధ దేశాల్లో శివాలయాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, మయాన్మార్ వంటి దేశాల్లో కొన్ని పురాతన శివాలయాలు ఉన్నాయి. అమెరికా, కెనడా, జపాన్, జర్మనీ, ఫిజీదీవులు, ఘనా, గయానా, నైజీరియా, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఆధునికకాలంలో నిర్మించిన శివాలయాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో శివారాధన శివుడిని ఎక్కువగా లింగరూపంలోనే భక్తులు పూజిస్తారు. కొన్నిచోట్ల శివుడిని మానుషవిగ్రహ రూపంలోనూ ఆరాధిస్తారు. సింధులోయ నాగరికత కాలం నాటికి శివుడిని పశుపతిరూపంలో ఆరాధించేవారు. శివుడికి యోగీశ్వర, అర్ధనారీశ్వర, నటరాజ, రుద్ర, వీరభద్ర, భైరవ తదితర రూపాలు ఉన్నాయి. లోకరక్షణ కోసం శివుడు అరవై ఐదు లీలారూపాలు దాల్చినట్లు శివపురాణం చెబుతోంది. వీటిలో ఇరవైనాలుగు రూపాలు ప్రధానమైనవి కాగా, మూడు రూపాలు అత్యంత ముఖ్యమైనవని శివపురాణ కథనం. శివుడు సగుణ రూపంలో ఫాలనేత్రంతో, ఒకచేత త్రిశూలం, మరోచేత డమరుకం, శిరసుపై నెలవంక, జటాఝూటంలో గంగ, మెడలోను, చేతులపైన సర్పాలు, శరీరంపై గజచర్మం, విబూది పూతతో దర్శనమిస్తాడు. చెంత జింక, వాహనంగా నంది ఎల్లప్పుడూ శివుడిని అంటిపెట్టుకుని ఉంటాయి. త్రిశూలం త్రిగుణాలకు సంకేతమని ‘లింగపురాణం’ చెబుతోంది. తలపైన నెలవంక మనశ్శాంతికి, గంగ మనోనిశ్చలతకు సంకేతాలు. సర్పాలు జీవాత్మలు. గజచర్మం అహంకార పరిత్యాగానికి సంకేతం. జింక చతుర్వేదాలకు, నంది సత్సాంగత్యానికి, ఫాలభాగాన ఉన్న మూడోకన్ను ధర్మపరిరక్షణకు చిహ్నాలు. శివుడు సృష్టి స్థితి లయకారకుడు. ప్రళయకాలంలో జగత్తును తనలో లయం చేసుకున్న శివుడు, సృష్టి స్థితులను కొనసాగించడానికి బ్రహ్మ విష్ణువులను నియమించినట్లు పురాణాల కథనం. శివుడిని జ్ఞానప్రదాతగా ప్రస్తుతించింది స్కాందపురాణం. లౌకికభోగాలు పొందడానికి శివలింగమే ఆలంబన అని శివభక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం శివుడే ఆదిగృహస్థుడు. ఆదర్శ దాంపత్యానికి శివపార్వతులే ప్రతీకలు. శివపూజ కోసం అట్టహాసమైన ఏర్పాట్లేవీ అవసరం లేదు. చెంబుడు నీటితో శివలింగాన్ని అభిషేకించి, చిటికెడు విబూది, మారేడు దళం భక్తిగా సమర్పించుకుంటే చాలు, తప్పక శివానుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. తీవ్రమైన అనారోగ్య కారణాల వల్ల కదల్లేని స్థితిలో ఉన్నవారు శివ మానసిక పూజ ద్వారా శివానుగ్రహం పొందగలరని అనుగ్రహిస్తూ ఆదిశంకరాచార్యులు శివ మానసిక పూజా స్తోత్రాన్ని రచించారు. కదల్లేని స్థితిలో ఉన్నవారు ఎలాంటి నియమాలూ పాటించలేకున్నా, ఈ భక్తి శ్రద్ధలతో స్తోత్రాన్ని పఠించినా, మననం చేసుకున్నా శివానుగ్రహం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. -
శివా..శివా.. తోసుకురాకండయ్యా..!
సాక్షి, సూర్యాపేట : మండలంలోని పిల్లలమర్రి గ్రామంలో జరిగిన శివరాత్రి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఐదు రోజుల శివరాత్రి వేడుకల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున ఎరకేశ్వరాలయం ఎదుట నిర్వహించిన అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయితే, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో శివపార్వతుల విగ్రహాలతో అగ్నిగుండాలు దాటే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులు ఒకరిపై ఒకరు తోసుకురావడంతో ఒత్తిడికి గురై అగ్నిగుండాల్లో పడిపోయారు. దీంతో పలువురు నిప్పుల్లో పడి గాయాలపాలయ్యారు. మండలి సైదమ్మ, షేక్ నజీమాతో పాటు చిన్నారి మధరబోయిన చందనకు గాయపడ్డారు. అక్కడే ఉన్న భక్తులు వెంటనే స్పందించి నిప్పుల్లో పడినవారిని బయటకు లాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
కాళహస్తీశ్వరునికి పట్టువస్త్రాలు సమర్చించిన బొజ్జల
-
ఓం నమ: శివాయ
-
ఓంకారమే ఆయన స్మరణం
-
శివరాత్రి ఫోటోలు 'సాక్షి'తో పంచుకోండి
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ శోభను సంతరించుకున్నాయి. ప్రధాన దేవాలయాలతో పాటు, చిన్న చిన్న ఊళ్లలోని ఆలయాలు కూడా శివరాత్రి శోభతో కళకళలాడనున్నాయి. మీ ఊళ్లలో గానీ, మీ పల్లెల్లో గానీ శివరాత్రి వేడుకల దృశ్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నారా.. అయితే వాటిని ఫొటోలు తీసి 'సాక్షి'కి పంపిండి. శివరాత్రి పండుగ పొటోలను 'వాట్స్ ఆప్' ద్వారా లేదా ఈ మెయిల్ ద్వారా పంపిస్తే, ఫొటోలను గ్యాలరీల రూపంలో సాక్షి వెబ్సైట్లో పెట్టి ప్రపంచానికి అందిస్తాం. అందుకు మీరు చేయాల్సిందల్లా.. 9705456222 అనే నెంబరుకు వాట్స్ యాప్‌లో పంపడం లేదా sakshiwebinfo@gmail.com అనే ఐడీకి ఈ మెయిల్ చేయడం. -
శైవక్షేత్రాల వద్ద భారీ బందోబస్తు
కోటప్పకొండపైకి వీవీఐపీ వాహనాలు మాత్రమే అనుమతి వీఐపీలకు 15 ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ఏర్పాటు ఏలూరు, గుంటూరు రేంజ్‌ల నుంచి భారీగా పోలీస్ బలగాలు సాక్షి, గుంటూరు : శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రాలుగా పేరొందిన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి, అమరావతి అమరేశ్వరస్వామి దేవస్థానాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కోటప్పకొండ తిరునాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి నాలుగేళ్ళుగా నిధులు కూడా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఎవ్వరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గుంటూరు రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకన్నారు. సోమవారం సాయంత్రం అధికారులు, సిబ్బందికి విధులను కేటాయించారు. నరసరావుపేట, చిలకలూరిపేట రోడ్ల గుండా కోటప్పకొండకు ప్రభలు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. మెట్లమార్గంలో భక్తుల భద్రతకు ప్రత్యేక పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. కోటప్పకొండలో ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 100 మంది సీఐలు, 200 మంది ఎస్సైలు, 300 మంది ఏఎస్సై, హెచ్‌సీలు, 1500 మంది కానిస్టేబుళ్ళు, 300 మంది ఏఆర్ కానిస్టేబుళ్ళు, 200 మంది ఏఎన్ఎస్ టీమ్, 800 మంది హోంగార్డులు, 10 స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్‌లు, వీరుకాక మఫ్టీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, క్రైం పోలీసులు, ఆర్మ్‌డ్‌ఫోర్స్, బీడీ టీమ్‌లు ఏర్పాటు చేశారు. వీరందరినీ సమస్వయ పరిచేందుకు కంట్రోల్‌రూమ్‌ను సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు. కొండపైకి ప్రైవేటు వాహనాలు నిషేధం కొండపైకి గతంలో మాదిరిగా ప్రైవేటు వాహనాలను అనుమతించకుండా నిషేధించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి అధికారుల వాహనాలకు మాత్రం వీవీఐపీ పాస్‌ల ద్వారా కొండపైకి అనుమతిస్తారు. వీఐపీ పాస్‌లున్న వాహనాలు సైతం కొండకింద టోల్‌ప్లాజా వరకు అనుమతిస్తారు. అయితే వీరికి 15 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి కొండపైకి, కిందికి ఉచితంగా చేర్చేలా ఏర్పాట్లు చేశారు. శివరాత్రికి దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు అరండల్‌పేట(గుంటూరు) : శివరాత్రి సందర్భంగా దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రధానంగా కోటప్పకొండ ఆలయం చీఫ్ ఫెస్టివల్ అధికారి(సీఎఫ్ఓ)గా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.వి.సురేష్‌బాబును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అమరావతి దేవాలయం ప్రత్యేక అధికారిగా సింగరకొండ ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్.రమణమ్మను, గోవాడకు జేఈఓ ధనలక్ష్మిలను ప్రత్యేకాధికారులుగా నియమించారు. కోటప్పకొండలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని దేవాదాయశాఖలో పనిచేస్తున్న సిబ్బందిని డిప్యూటేషన్‌పై అక్కడ నియమించారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.బి.శ్రీనివాస్ మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఆలయాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అర్చకులకు తగిన ఆదేశాలు జారీచేశామన్నారు. అమరావతి, గోవాడ, కోటప్పకొండలకు అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని విభాగాల అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. సారించరనేది వీరి ఆలోచన.