
శివరాత్రి ఫోటోలు 'సాక్షి'తో పంచుకోండి
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ శోభను సంతరించుకున్నాయి. ప్రధాన దేవాలయాలతో పాటు, చిన్న చిన్న ఊళ్లలోని ఆలయాలు కూడా శివరాత్రి శోభతో కళకళలాడనున్నాయి.
మీ ఊళ్లలో గానీ, మీ పల్లెల్లో గానీ శివరాత్రి వేడుకల దృశ్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నారా.. అయితే వాటిని ఫొటోలు తీసి 'సాక్షి'కి పంపిండి. శివరాత్రి పండుగ పొటోలను 'వాట్స్ ఆప్' ద్వారా లేదా ఈ మెయిల్ ద్వారా పంపిస్తే, ఫొటోలను గ్యాలరీల రూపంలో సాక్షి వెబ్సైట్లో పెట్టి ప్రపంచానికి అందిస్తాం. అందుకు మీరు చేయాల్సిందల్లా.. 9705456222 అనే నెంబరుకు వాట్స్ యాప్లో పంపడం లేదా sakshiwebinfo@gmail.com అనే ఐడీకి ఈ మెయిల్ చేయడం.