
సాక్షి, సూర్యాపేట : మండలంలోని పిల్లలమర్రి గ్రామంలో జరిగిన శివరాత్రి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఐదు రోజుల శివరాత్రి వేడుకల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున ఎరకేశ్వరాలయం ఎదుట నిర్వహించిన అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయితే, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో శివపార్వతుల విగ్రహాలతో అగ్నిగుండాలు దాటే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులు ఒకరిపై ఒకరు తోసుకురావడంతో ఒత్తిడికి గురై అగ్నిగుండాల్లో పడిపోయారు. దీంతో పలువురు నిప్పుల్లో పడి గాయాలపాలయ్యారు. మండలి సైదమ్మ, షేక్ నజీమాతో పాటు చిన్నారి మధరబోయిన చందనకు గాయపడ్డారు. అక్కడే ఉన్న భక్తులు వెంటనే స్పందించి నిప్పుల్లో పడినవారిని బయటకు లాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Comments
Please login to add a commentAdd a comment