షిల్లాంగ్: కరోనా పోరాటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిచేందుకు ప్రముఖులు, బడా పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఆ జాబితాలో మేఘాలయ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బ్యాండ్ కంపెనీ సోల్‌మేట్ చేరింది. సోషల్ మీడియా (ఫేస్‌బుక్ పేజీ) ద్వారా ప్రదర్శన ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల ద్వారా నిధులు సేకరిస్తామని సోల్‌మేట్ బ్యాండ్ మ్యూజికల్ ఆర్టిస్ట్ రూడీ వాల్లాంగ్ చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారికి, కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నవారికి వచ్చిన మొత్తం అందిస్తామని అన్నారు. కాగా, తమ ఫేస్‌బుక్ పేజీలో గత ఆదివానం సోల్‌మేట్ బ్యాండ్ ప్రదర్శన ఇవ్వగా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమనుల నుంచి మంచి స్పందన వచ్చింనదని రూడీ తెలిపారు.
‘రూరల్ 7ట్రెప్ ఎయిడ్ కోవిడ్-19’పేరుతో విరాళాలు సేకరించామని వెల్లడించారు. ‘మేమున్న ప్రదేశం నుంచే లైవ్‌లో ప్రదర్శన ఇచ్చాం. మనదేశం నుంచే కాక విదేశాల్లో ఉన్న అభిమానులు కూడా ఆర్థిక సాయం చేశారు. దాదాపు 8 లక్షల రూపాయలు సమకూరాయి. మరిన్ని విరాళాలు సేకరించి లాక్‌డౌన్‌తో ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నవారికి .. వైరస్ నియంత్రణకై శ్రమిస్తున్నవారికి వాటిని అందిస్తాం. లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న మ్యూజిషిన్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతున్నాం. ఆ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాం. కాగా, కరోనా కేసులు లేని రాష్ట్రాల్లో మేఘాలయ కూడా ఒకటి. ఆర్థిక పరంగా చూసుకుంటే లాక్‌డౌన్ సరైంది కాదని నా అభిప్రాయం’అని రూడీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment