
ఎన్నికలొస్తున్నాయంటే రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాలకు అగ్ని పరీక్ష. ఆ గ్రామాలు ఎవరి కిందకి వస్తాయో కచ్చితమైన నిబంధనలు ఉండవు. ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతూ పంచాయితీలు పెడుతుంటారు. వజ్రాయుధం లాంటి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వారికి ఉండదు. అసోం – మేఘాలయా సరిహద్దుల్లోని లాంగ్‌టూరి గ్రామానికి చెందిన 150 మంది గరో అనే తెగకు చెందిన ప్రజలకు ఈసారి ఓటు హక్కు లభించలేదు.
1940 సంవత్సరం నుంచి వాళ్ల తల్లిదండ్రులు, తాత ముత్తాలు ఈ గ్రామంలోనే ఉంటున్నారు. కానీ ఇప్పటి వరకు వారికి ఓటు వేసే అవకాశం ఒక్కసారి కూడా రాలేదు. ఈ గ్రామం ఏ రాష్టం పరిధిలోకి వస్తుందన్న దానిపై ఇప్పటివరకు ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అక్కడ ప్రజలు తమకు అసోంలో గౌహతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని బోకో అసెంబ్లీ పరిధిలో ఓటు హక్కు కల్పించాలని చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. ఈ గ్రామం గౌహతికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే కామరూప్ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఆఫ్ పోలీసు కమల్ కుమార్ బైశ్య ఈసారికి ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు కాలేదని, వచ్చే ఎన్నికల నాటికి తప్పక చేస్తామని అంటున్నారు. వారి ఆశ ఎప్పటికి తీరేనో మరి.
Comments
Please login to add a commentAdd a comment