సిమ్లా: అక్రమ మైనింగ్‌ను ఆపలేకపోయిన కారణంగా మేఘాలయ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) భారీ జరిమానా విధించింది. ప్రభుత్వానికి 100 కోట్లు జరిమాన విధిస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఏకే గోయల్ శనివారం తీర్పును వెలువరించారు. నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ లేకుండా మైనింగ్‌ను నిర్వహిస్తున్న కంపెనీలకు రద్దు చేయాలని 2014లో ఎన్‌జీటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అనంతరం రాష్ట్రంలోని మైనింగ్ పరిశీలనకు పర్యటించిన కమిటీ ఈఏడాది జనవరి 2న ఎన్‌జీటీకి నివేదికను అందించింది. రాష్ట్రంలో 24వేలకు పైగా అక్రమ మైనింగ్ కంపెనీలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. అక్రమ మైనింగ్ కారణంగా నీరు, గాలి, వాతావరణం కాలుష్యానికి గురువుతోందని తీర్పులో పేర్కొన్నారు. రెండు నెలల్లోగా కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) వద్ద రూ.100 కోట్లు జమ చేయాలని గోయల్ ఆదేశించారు.
మేఘాలయలోని బొగ్గు గనుల్లో ఇటీవల 15 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దట్టమైన చెట్లు ఉన్న కొండపై ఎలుక బొరియల్లా ఉండే గనుల్లో అక్రమంగా బొగ్గు తవ్వేందుకు కూలీలు లోపలికి వెళ్లారు. పక్కనే ప్రవహిస్తున్న లిటిల్ నది నీరు గనిలోకి ముంచెత్తడంతో కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, వైమానిక దళం, అగ్నిమాపక దళం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కార్మికుల ఆచూకి ఇప్పటివరకు దొరకటేదు.
Comments
Please login to add a commentAdd a comment