షిల్లాంగ్ : కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో వీలైనన్ని విధాలుగా దాన్ని అడ్డుకోవటానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్టవేసే దిశగా రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రదేశాలను మూసివేస్తూ మేఘాలయ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదలచేసింది. ఈ నెల 31వ తేదీ వరకు అన్ని పర్యాటక ప్రదేశాలు మూసివేయబడతాయని, అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ 15వ తేదీ వరకు ఈ బంద్ కొనసాగవచ్చని పేర్కొంది. మేఘాలయ, షిల్లాంగ్‌లతో పాటు ఇతర ప్రదేశాలను పర్యటించదల్చుకున్నవారు షెడ్యూల్‌లో మార్పులు చేసుకోవాలని కోరింది. ( చేతికి క్వారంటైన్ ముద్రతో గరీబ్ రథ్‌లో.. )
చదవండి : కరోనా పేషెంట్ల బట్టలు ఉతకం
Comments
Please login to add a commentAdd a comment