Meghalaya: Police Raids On BJP Leader Farm House, 6 Children Rescued, 73 Arrested - Sakshi
Sakshi News home page

Meghalaya: ఫామ్‌ హౌసులో గుట్టుగా బీజేపీ నేత సెక్స్‌ రాకెట్‌.. 23 మంది మహిళలు, 73 మంది..

Jul 24 2022 11:22 AM | Updated on Jul 24 2022 1:35 PM

Meghalaya Police Raids On  BJP Bernard N Marak Farm House - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. మేఘాలయ బీజేపీ ముఖ్య నేత అకృత్యాలు బయటకు రావడంతో సంచలనంగా మారింది. తన ఫామ్‌ హౌసులో గుట్టుగా వ్యభిచార గృహం నిర్వస్తున్న బీజేపీ నేత బెర్నార్డ్‌ మరాక్‌.. అలియాస్‌ రింపు గుట్టురట్టు అయ్యింది. 

వివరాల ప్రకారం..  మేఘాలయ బీజేపీ నేత బెర్నార్డ్‌ మరాక్‌.. వెస్ట్ గారోహిల్స్ జిల్లాలోని తురా పట్టణంలోని ఉన్న తన ఫాంహౌసు​లో గుట్టుగా సెక్స్‌ రాకెట్‌ను నడుపుతున్నాడు. ఈ మేరకు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో శనివారం పోలీసులు ఆకస్మిక రైడ్స్‌ చేశారు. దాడుల్లో భాగంగా.. ఐదుగురు చిన్నారులను రక్షించినట్టు వెస్ట్‌ గారో హిల్స్‌ జిల్లా ఎస్పీ వివేకానంద్‌ సింగ్‌ వెల్లడించారు. వారిలో నలుగురు బాలురు, ఒక అమ్మాయి ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో వ్యభిచార దందాతో సంబంధం ఉన్న  73 మంది అరెస్ట్‌ చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు. వారిలో 23 మంది మహిళలు ఉన్నారు. 

ఇక, ఫామ్‌హౌసులో 30 చిన్న గదులు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, రక్షింపబడిన చిన్నారులు.. దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. పోలీసుల రైడ్స్‌లో భాగంగా.. 400 మందు బాటిళ్లు, 500కు పైగా కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, 47 మొబైల్‌ ఫోన్లు, 8 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దీంతో, మారక్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్టు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మారక్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మారక్‌ గతంలో మిలిటెంట్‌గా విధులు నిర్వహించాడు. అనంతరం రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసి.. బీజేపీలో చేరారు. మేఘాలయ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement