
తురాలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం
షిల్లాంగ్ : మేఘాలయ సీఎం, పాలక నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) చీఫ్ కన్రాడ్ కే సంగ్మా దక్షిణ తురా అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చార్లెట్ మొమిన్‌పై 8400 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పోలయిన ఓట్లలో సంగ్మాకు 13,656 ఓట్లు లభించగా, సమీప ప్రత్యర్థి మొమిన్‌కు 8421 ఓట్లు దక్కాయని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎఫ్‌ఆర్ కర్కోంగర్ వెల్లడించారు. సంగ్మా అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఈ స్ధానం నుంచి ముఖ్యమంత్రి సోదరి, మాజీ కేంద్ర మంత్రి అగత సంగ్మా రాజీనామా చేశారు.
60 మంది సభ్యులు కలిగిన మేఘాలయా అసెంబ్లీలో తాజా గెలుపుతో పాలక ఎన్‌పీపీ సంఖ్యాబలం విపక్ష కాంగ్రెస్‌తో సమానంగా 20కి చేరుకుంది. ఆరు పార్టీలతో కూడిన మేఘాలయా డెమొక్రాటిక్ అలయన్స్(ఎండీఏ) ప్రభుత్వానికి ఎన్‌పీపీ నేతృత్వం వహిస్తోంది.ఇక రాణికోర్ ఉప ఎన్నికలో యునైటెడ్ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి పియోస్ మార్విన్ 3,390 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment