షిల్లాంగ్: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఈ మహమ్మారి వీఐపీల నుంచి సామాన్యుల వరకు ఏ ఒక్కరిని, ఏ రంగాల వారిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
తాజాగా, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను కరోనా బారిన పడినట్లు కాన్రాడ్ సంగ్మా ట్విటర్‌ద్వారా వెల్లడించారు. ‘కొన్ని రోజులుగా తాను.. స్వల్ప అస్వస్థతగా ఉండటంతో.. కరోనా ఉండటంలో పరీక్షలు చేసుకున్నానని.. దీనిలో కోవిడ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు’. అదే విధంగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కాగా, కాన్రాడ్ సంగ్మా 2020లోను కరోనా బారిన పడ్డారు.
I have tested positive for COVID-19. I am isolating myself for the required time. I have mild symptoms. All those who came into contact with me last few days are requested to observe their symptoms and test if necessary.
— Conrad Sangma (@SangmaConrad) January 21, 2022
చదవండి: ఇక నుంచి కరోనాను నిమిషాల్లో గుర్తించవచ్చు.. ఎలాగంటారా..
Comments
Please login to add a commentAdd a comment