ఉగ్రవాద నిరోధం కోసం 13వేల మందికి...! | To check radical Islamism, Tajikistan cops shave 13,000 men's beards | Sakshi
Sakshi News home page

ఉగ్రవాద నిరోధం కోసం 13వేల మందికి...!

Published Thu, Jan 21 2016 4:11 PM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM

ఉగ్రవాద నిరోధం కోసం 13వేల మందికి...! - Sakshi

ఉగ్రవాద నిరోధం కోసం 13వేల మందికి...!

న్యూఢిల్లీ: తజికిస్థాన్ పోలీసులు తాజాగా 13వేల మంది పురుషులకు గడ్డాలు గీయించారు. సంప్రదాయబద్ధమైన ముస్లిం వస్త్రాలను అమ్మే 160 దుకాణాలను మూసివేయించారు. దేశంలో రాడికల్ ఇస్లామిజాన్ని నిరోధించేందుకు తజికిస్థాన్ ఈ మేరకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. మధ్య ఆసియా ముస్లిం మెజారిటీ దేశమైన తజికిస్థాన్‌.. ముస్లిం తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పొరుగు దేశం ఆఫ్ఘనిస్థాన్ ప్రభావం తమపై పడకుండా ఉండేందుకు ఈ మేరకు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నదని అల్ జజీరా చానెల్‌ ఓ కథనంలో తెలిపింది. అంతేకాకుండా బురఖా ధరించకుండా 1700 మంది మహిళల్ని ఆ దేశ ప్రభుత్వం ఒప్పించిందని, లౌకిక నాయకత్వంలో కొనసాగుతున్న తజికిస్థాన్‌.. ఆఫ్ఘనిస్థాన్ ప్రభావం తమపై పడకుండా చాలాకాలంగా జాగ్రత్త వహిస్తోందని వివరించింది.

ఈ క్రమంలోనే గతవారం తజికిస్థాన్ పార్లమెంటు అరబ్‌ ధ్వనించే పదాలను నిషేధించింది. అలాగే, ఫస్ట్ కజిన్స్ మధ్య వివాహ సంప్రదాయాన్నీ నిషేధించింది. ఫస్ట్ కజిన్స్ పెళ్లి చేసుకునేందుకు ఇస్లాం మతంలో అనుమతి ఉంది. ఇక గత ఏడాది తజికిస్థాన్‌ సుప్రీంకోర్టు ఇస్లామిక్ రినైజాన్స్ పార్టీని నిషేధించింది. దేశంలో మతహింస చోటుచేసుకోవడంతో రాడికల్ ఇస్లామిజమే ఇందుకు కారణమంటూ తొలి ఇస్లామిక్ రాజకీయ పార్టీ అయిన దీనిని రద్దు చేసింది.

దేశంలో లౌకిక భావనను పెంపొందించి.. విదేశీ ప్రభావాలను నిరోధించేందుకు వీలుగా తజికిస్థాన్ అధ్యక్షుడు ఇమొమాలి రఖ్మోన్ కొత్త చట్టాలు తేవాలని భావిస్తున్నారు. 1994 నుంచి దేశాన్ని పాలిస్తున్న ఆయన ప్రస్తుత పదవీకాలం గడువు 2020లో ముగియనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement