ఆ తరువాత...
రెండు రోజుల క్రితం ఒక ఆసక్తికరమైన విషయంతో వార్తల్లోకి వచ్చింది తజికిస్తాన్. గడ్డాలు మీసాలు పెంచుకుంటున్న వారిపై తజికిస్తాన్ పాలకులు కన్నెర్రజేసి కత్తి కట్టారట. దొరికిన వాళ్లను దొరికినట్లు గెడ్డాలు మీసాలు తీయిస్తున్నారట. దీని వెనక పాలకుల రహస్య ఎజెండా ఏమిటో తెలియదుగానీ... ఈ బలవంతపు ముఖ కేశ ఖండనపై నిరసన బలంగా వినిపిస్తోంది. సోవియట్ యూనియన్‌లో ఉన్నంత వరకు తజికిస్తాన్ అనేది ఒక దేశంలో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై గుర్తింపుతో ఉండేది.
ఎప్పుడైతే సోవియట్ యూనియన్ పతనమైందో... అప్పుడు తజికిస్తాన్‌కు స్వాతంత్య్రం వచ్చింది. తజికిస్తాన్ కాస్తా ‘రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్’ అయింది. భిన్నమైన ప్రాచీన సంస్కృతులు పరిఢవిల్లిన రాజ్యం... తజికిస్తాన్. స్వాతంత్య్రం స్వయంశక్తిని ఇవ్వాలి. స్వతంత్ర రాజ్యం తనదైన గుర్తింపును తెచ్చుకోవాలి. 9 సెప్టెంబర్ 1991లో స్వాతంత్య్ర ప్రకటన తరువాత... దురదృష్టవశాత్తు తజికిస్తాన్‌లో అంతర్గత కలహాలు చెలరేగాయి. 1997 వరకు కొనసాగిన ఈ కలహాల్లో వేలాదిమంది చనిపోవడం, దేశం విడిచిపోవడం జరిగింది.
ఆ నేడు 9 సెప్టెంబర్, 1991
Published Tue, Sep 8 2015 11:38 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM
Advertisement
Advertisement