షాంఘై: భారత్-చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల రక్షణ మంత్రులు రష్యా రాజధాని మాస్కోలో సమావేశమయ్యారు. షాంఘై సహకార సంస్థ( ఎస్‌ఓసీ) మంత్రుల స్థాయి సమావేశంలో సరిహద్దు అంశాన్ని రాజ్‌నాథ్‌సింగ్ లేవనెత్తారు. అనంతరం చైనా రక్షణ మంత్రి వీ ఫెంఘే, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మధ్య దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. లద్దాఖ్‌లో ఇరుదేశాల మధ్య ఘర్షణలు మొదలయ్యాక ఇప్పటి వరకు సైనిక ఉన్నతాధికారుల మధ్య మాత్రమే ఇప్పటి వరకు చర్చలు జరిగాయి. అత్యున్నత స్థాయి రాజకీయ నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి.
కొద్ది వారాల కిందట భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సమావేశంలో మే నెలకు ముందున్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారు. అయితే చైనా మాత్రం భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించింది. చిన్న భూభాగాన్ని కూడా వదలుకోవడానికి చైనా సిద్ధంగా లేదని ఫెంఘే తెలిపారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకోవడానికి భారత్ ముందడుగు వేయాలని అన్నారు.
చదవండి: సరిహద్దుల్లో టెన్షన్..టెన్షన్
Comments
Please login to add a commentAdd a comment