Boarder dispute
-
చైనాతో సంబంధాలు ముఖ్యమైనవి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ:భారత్, చైనా దేశాల మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు నెలకొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. భారత్, చైనా మధ్య శాంతి ఇరు దేశాలకే కాక మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ముఖ్యమైనదని మోదీ అన్నారు. ప్రధాని మోదీ బుధవారం మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-చైనా సరిహద్దు వివాదం వెంటనే కొలిక్కి రావాలన్నారు. ‘భారత్‌కు చైనాతో సంబంధాలు చాలా ముఖ్యమైనవే కాక ప్రాధాన్యతో కూడినవి. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాలు ద్వైపాక్షిక పరస్పర చర్చల ద్వారా సరిహద్దు ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. స్థిరమైన, శాంతియుత సంబంధాలు నెలకొనటం ఇరు దేశాలకు చాలా అవసరం. ఇరు దేశాల మధ్య శాంతి ప్రపంచానికి సైతం ప్రాధాన్యత కలిగిన అంశం. ఇరు దేశాల మధ్య సానుకూల దౌత్య, మిలిటరీ స్థాయి ద్వైపాక్షిక చర్చల జరుగుతాయని ఆశిస్తున్నా. మేము(భారత్, చైనా దేశాలు) సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరించి, కొనసాగించగలం’ అని ప్రధాని మోదీ వివరించారు. జూన్, 2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద చోటు చేసుకున్న ఘర్షణల నుంచి భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో అనేక సార్లు దౌత్య, ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. భారత్, చైనా సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే చైనా మాత్రం తరచూ ఏదో ఒక సరిహద్దు విషయంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 30 ప్రాంతాల పేర్లు మార్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. -
చైనా కుట్ర : సరిహద్దుల్లో పంజాబీ సాంగ్స్
సాక్షి, న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి చైనా- భారత్ సరిహద్దులో డాగ్రన్ కంట్రీ ఒప్పందాలు తుంగలో తొక్కుతూ కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా చైనా అనేక కుట్రలు పన్నుతూ భారత్‌ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు మరొక నీచమైన చర్యకు చైనా పాల్పడింది. వాస్తవాధీన రేఖ వెంబడి భారీ లౌడ్ స్పీకర్లు ఉంచి, పంజాబీ సాంగ్స్ ప్లే చేస్తూ భారత సైన్యం దృష్టి మరల్చే ప్రయత్నాలు మొదలు పెట్టింది. లద్ధాఖ్లోని ప్యాంగ్యాంగ్ ప్రాంతంలోని ఫింగర్ 4 ఏరియాలో లౌడ్ స్పీకర్లను ఉంచింది. చైనాతో సరిహద్దు వివాదం మొదలవడంతో భారత సైన్యం పగలు, రాత్రి అనే తేడా లేకుండా కంటిమీద కునుకేయకుండా కాపల కాస్తోంది. దీంతో వారి కన్నుగప్పడానికి చైనా ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతోంది. అంతటితో ఆగకుండా హిందీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడ చేస్తున్నట్లు భారత ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. మన సైనికులు ఇలాంటి ప్రలోభాలకు లొంగడం లేదని, అంతేకాకుండా మ్యూజిక్ వింటూ ఆనందిస్తున్నారని ఆ అధికారి పేర్కొన్నారు. ఇక చైనా భారత్ వివాదం గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పార్లమెంట్లో మాట్లాడుతూ, భారత భూభాగం 38,000 కిలోమీటర్ల చదరపు అడుగులను చైనా ఆక్రమించిందని తెలిపారు. సరిహద్దు ఒప్పందాన్ని అతిక్రమించి చైనా ఈ దుశ్చర్యలకు పాల్పడుతుందని ఆయన పేర్కొన్నారు. శాంతి ఒప్పందం ద్వారా భారత్ ఈ సమస్యను పరిష్కరించాలని ఆలోచిస్తుందని రాజ్‌నాధ్ సింగ్ తెలిపారు. చదవండి: చైనా నుంచి చొరబాట్లు లేవు -
చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ సింగ్ భేటీ
షాంఘై: భారత్-చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల రక్షణ మంత్రులు రష్యా రాజధాని మాస్కోలో సమావేశమయ్యారు. షాంఘై సహకార సంస్థ( ఎస్ఓసీ) మంత్రుల స్థాయి సమావేశంలో సరిహద్దు అంశాన్ని రాజ్‌నాథ్‌సింగ్ లేవనెత్తారు. అనంతరం చైనా రక్షణ మంత్రి వీ ఫెంఘే, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మధ్య దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. లద్దాఖ్‌లో ఇరుదేశాల మధ్య ఘర్షణలు మొదలయ్యాక ఇప్పటి వరకు సైనిక ఉన్నతాధికారుల మధ్య మాత్రమే ఇప్పటి వరకు చర్చలు జరిగాయి. అత్యున్నత స్థాయి రాజకీయ నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి. కొద్ది వారాల కిందట భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సమావేశంలో మే నెలకు ముందున్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారు. అయితే చైనా మాత్రం భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించింది. చిన్న భూభాగాన్ని కూడా వదలుకోవడానికి చైనా సిద్ధంగా లేదని ఫెంఘే తెలిపారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకోవడానికి భారత్ ముందడుగు వేయాలని అన్నారు. చదవండి: సరిహద్దుల్లో టెన్షన్..టెన్షన్ -
మోదీ.. అబద్ధాలు ఎందుకు?: రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా-భారత్ సరిహద్దుల్లో ఇటీవల నెలకొన్న పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మే నెలలో తూర్పు లడఖ్ ప్రాంతంలోకి చైనా ఆర్మీ ప్రవేశించినట్లు తెలుపుతూ వచ్చిన ఓ వార్తను రాహుల్ గాంధీ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. జూన్ 15వ తేదీ గల్వాన్ లోయ వద్ద చైనా-భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణ కంటే నెల రోజుల ముందే చైనా ఆర్మీ భారత్‌లో ప్రవేశించిందని మండిపడ్డారు. Why is the PM lying?https://t.co/sEAcOTsZsY — Rahul Gandhi (@RahulGandhi) August 6, 2020 లద్దాఖ్ వద్ద భారత భూభాగాన్ని చైనా దళాలు మేలోనే ఆక్రమించాయని రక్షణ శాఖ ఒక రిపోర్టులో పేర్కొంది. ఈ విషయాన్ని ఒక జాతీయ మీడియా తన పత్రికలో ప్రచురించింది. అయితే వాస్తవాధీన రేఖ వద్ద భూభాగాన్ని చైనా బలగాలు ఆక్రమించాయని భారత రక్షణశాఖ మాత్రం ఆ నిజాన్ని దాచి పెట్టిందని రాహుల్ చెప్పారు. కూగ్రంగ్ నాలా, గోగ్రా, పాన్‌గంగ్ సో ప్రాంతాల్లోకి మే నెల 17, 18వ తేదీల్లో చైనా ఆర్మీ వచ్చినట్లు రక్షణ శాఖ తెలిపిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు అసత్యాలు చెబుతున్నారని రాహుల్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. జూన్ 15న గల్వాన్ లోయలో చైనా- భారత్ మధ్య జరిగిన ఘర్షణలలో 20 మందికి పైగా భారత్ సైనికులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. చదవండి: ఆ వార్త అవాస్తవం: చైనా -
డబ్ల్యూఏసీ చీఫ్‌గా వివేక్ రామ్ చౌదరి
సాక్షి, న్యూఢిల్లీ: సున్నితమైన లద్దాఖ్ సెక్టార్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాల వైమానిక రక్షణను చూసుకునే భారత వైమానిక దళం వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ (డబ్ల్యూఏసీ) కొత్త కమాండర్-ఇన్-చీఫ్‌గా ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరిని నియమించినట్లు అధికారులు ప్రకటించారు. చౌదరి ప్రస్తుతం ఈస్టర్న్ ఎయిర్ కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు . ఎయిర్ మార్షల్ బి సురేష్ అనంతరం ఆగస్టు 1 నుంచి ఈ బాధ్యతలు తీసుకోనున్నారు. చదవండి: 40 వేల మంది చైనా సైనికుల తిష్ట! చైనాతో సరిహద్దు వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంలో భాగంగా డబ్ల్యూఏసీ చీఫ్‌గా చౌదరిని నియమించినట్లుగా తెలుస్తోంది. భారత వైమానిక దళం గత కొన్ని వారాలుగా తూర్పు లడఖ్ ప్రాంతంలో రాత్రి సయంలో వాయు గస్తీని నిర్వహిస్తోంది. ఇప్పటికే సుఖోయ్ 30 ఎమ్కేఐ, జాగ్వార్, మిరాజ్ 2000 విమానాల వంటి ఫ్రంట్‌లైన్ ఫైటర్ జెట్లను లద్దాఖ్‌లోని సరిహద్దు స్థావరాలతో పాటు పలు ప్రాంతాలలో ఉంచారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్ధి అయిన ఎయిర్ మార్షల్ చౌదరి 1982 డిసెంబర్ 29 న ఐఏఎఫ్‌లో చేరారు. ఆయన మిగ్ -21, మిగ్ -23 ఎమ్ఎఫ్, మిగ్ -29, ఎస్‌యూ -30 ఎంకేఐలతో సహా పలు విమానాలను నడిపారు. చదవండి: లద్దాఖ్‌కు యుద్ధ విమానాలు -
భారత్, చైనా మధ్య సుదీర్ఘ చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తలను తొలగించడానికి భారత్-చైనా మధ్య జరిగిన కోర్ కమాండర్ స్థాయి చర్చలు ముగిశాయి. లద్ధాఖ్లోని చుషుల్‌లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన చర్చలు, బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ముగిశాయి. సుమారు 15 గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. భారత ప్రతినిధి బృందానికి లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నాయకత్వం వహించగా, సౌత్ జిన్జియాంగ్ సైనిక ప్రాంత కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ చైనా వైపు నాయకత్వం వహించారు. జూన్ 15 న గాల్వన్ లోయ ఘర్షణ తరువాత ఇరు దేశాల మధ్య ఇంత సుదీర్ఘంగా చర్చలు జరగడం ఇదే తొలిసారి. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. చదవండి: సైనికుల అంత్యక్రియలు.. చైనా అభ్యంతరం! గాల్వన్ లోయలో భారత్ - చైనా సరిహద్దు వద్ద హింసాత్మక ఘటనలు చోటు చేసుకోక ముందు తూర్పు లద్దాఖ్‌లో ఉన్న పరిస్థితులను పూర్తిగా యధాతధంగా పునరుద్ధరించాలని భారతదేశం పట్టుబడుతోంది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట ఉన్న సాయుధ బలగాలు, ఆయుధాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఇరు దేశాలు చర్యలు చేపట్టాలని కోరారు. లద్ధాఖ్లోని కొన్ని ప్రాంతాలను తమ భూభాగాలుగా చైనా కొనసాగిస్తూ చేస్తున్న కొత్త వాదన పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయానికి సంబంధించి చైనా భారత్ మధ్య నాలుగు సార్లు చర్చలు జరిగాయి. చైనా ఇప్పటికే గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, గాల్వన్ లోయ నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. భారత్- చైనా మధ్య జరిగిన కాల్పులలో భారత్‌కు చెందిన ఇరవై మంది సైనికులు తమ ప్రాణాలను అర్పించిన సంగతి తెలిసిందే. -
భారత్-చైనా సరిహద్దులో మెరుగవుతున్న పరిస్థితులు
బీజింగ్: వివాదాస్పదమైన చైనా-ఇండియా సరిహద్దు పశ్చిమ భాగంలో పరిస్థితి మెరుగుపడుతోందని చైనా గురువారం తెలిపింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంట భయంకరమైన సంక్షోభం తరువాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతున్నాయని చైనా పేర్కొంది. ఇండియా-చైనా బోర్డర్ అఫైర్స్ పై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ & కోఆర్డినేషన్ (డబ్ల్యుఎంసీసీ) బీజింగ్, న్యూ ఢిల్లీతో కొత్తగా మరో రౌండ్ చర్చలు జరుపుతుందని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. కమాండర్-స్థాయి చర్చలలో చైనా, భారత సరిహద్దు దళాలు గాల్వన్ లోయ, ఇతర ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా సమర్థవంతమైన చర్యలు తీసుకున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ గురువారం సాధారణ మంత్రిత్వ శాఖ సమావేశంలో చెప్పారు. (అప్రమత్తత అవసరం) సరిహద్దు వెంబడి పరిస్థితులు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. బలగాలను వెనక్కి తీసుకురావడానికి మాలాగే భారత్ కూడా ప్రయత్నిస్తుందని, ఈ విషయంలో మాతో కలిసి పనిచేస్తోందని భావిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. దీంతో రెండు నెలలకు పైగా చైనా భారత్ మధ్య సరిహద్దులో జరుగుతున్న ఘర్షణలు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూలై 5 వ తేదీన జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రితో సుమారు రెండుగంటల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అప్పటి నుంచి సరిహద్దు పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. చదవండి: రంగంలోకి దోవల్ : తోక ముడిచిన చైనా -
ఆ వార్త అవాస్తవం: చైనా
బీజింగ్: భారత సరిహద్దులోని గల్వాన్ లోయలో, భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనా సైనికులు 43 మందికి పైగా చనిపోయారన్న వార్తను చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జోహో లిజ్జాఆన్ మంగళవారం ఖండించారు. అది అసత్య ప్రచారమని కొట్టిపడేశారు. సరిహద్దు విషయాలను పరిష్కరించుకునేందుకు చైనా-ఇండియా మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. (భారత్- చైనా సరిహద్దు ‘చిచ్చు’కు కారణం?) గత సోమవారం జూన్ 15న గల్వాన్ లోయలో చైనా- ఇండియా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలలో 43 మంది వరకు చైనా సైనికులు చనిపోయారనే వార్తను లిజియాన్ ఖండించారు. భారత్‌కు చెందిన 20 మంది సైనికులు ఈ ఘర్షణలో చనిపోయారు. సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు సోమవారం ఇరుదేశాల లెఫ్టినెంట్ జనరల్‌ల మధ్య చర్చలు జరిగాయి. అంతకుముందు జూన్6వ తేదీన కూడా లెఫ్టెనెంట్ జనరల్స్ మధ్య చర్చలు జరిగినప్పటికి జూన్ 15వ తేదీన ఇరుదేశాల సరిహద్దు ఒప్పందాలను అతిక్రమించి చైనా భారత్‌పై దాడి చేసింది. (చైనా జనరల్ ఆదేశంతోనే భారత్ పై దాడి!) -
ఇండియా- నేపాల్ సరిహద్దు వివాదంలో హీరోయిన్!
ముంబాయి: ఎంతో కాలంగా మంచి స్నేహితులుగా ఉన్న ఇండియా- నేపాల్ మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ భారత్ పై ఘాటుగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనికి భారత్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ వివాదంలో బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాలా కూడా చిక్కుకున్నారు. ఈ వివాదం పై ఆమె స్పందిస్తూ ‘మా చిన్న దేశం గౌరవాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు. మూడు గౌరనీయమైన దేశాల మధ్య శాంతిపూర్వక, మర్యాదప్రదమైన సంప్రదింపులు జరగాలని ఎదురుచూస్తున్నాం’ అని ట్వీట్ చేసింది. అయితే ఈ విషయంలో నెటిజన్లు మనీషా పై ఫైర్ అవుతున్నారు. ఈ ట్వీట్‌పై ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు. (భారత్‌పై నేపాల్ ప్రధాని షాకింగ్ కామెంట్లు!) దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ ‘ మనీషా బేటా నువ్వు మనసుతో ఆలోచించూ లేక పోతే సిగ్గుంటే ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉండూ దీనిని రాజకీయం చెయ్యొద్దు. మీరు చైనాతో ఉన్నారు. మీ ప్రేమను దాచి ఉంచుకోండి లేకపోతే నువ్వు ముంబాయిలో సంపాదించింది మొత్తం పోతుంది’ అని ట్వీట్ చేశాడు. దీనిపై చాలా మంది వివిధ రకాలుగా స్పందిస్తూ మనీషాని ట్రోల్ చేస్తున్నారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలు తన భూభాగంలోనివేనంటూ నేపాల్ విడుదల చేసిన కొత్త మ్యాప్‌ను ఆ దేశ కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి బుధవారం కటువైన వ్యాఖ్యలు కూడా చేశారు. భారత్ రాజముద్రలో వుండే మూడు సింహాల ముందు ‘సత్యమేవ జయతే’ అని వుంటుందని, ఆ దేశం దానికి కట్టుబడి వుంటుందో, సింహమేవ జయతే అనుకుంటుందో చూడాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు. కరోనా వైరస్‌ను గుర్తుకు తెచ్చేలా ‘చైనా వైరస్ కంటే, ఇటలీ వైరస్ కంటే ఇండియా వైరస్ ప్రమాదకరమైనదంటూ పరుషంగా మాట్లాడిన సంగతి విదితమే. (నేపాల్ దూకుడుకు భారత్ గట్టి కౌంటర్) -
పర్వతాన్ని కదిలిస్తారేమో.. మమ్మల్ని కష్టం: చైనా
బీజింగ్: చైనా మరోసారి తన నోటి దురుసును చూపించింది. మాటల దాడిని పెంచింది. భారత్ తమ గురించి తక్కువ అంచనా వేసుకోవద్దని, భ్రమల్లో ఉండొద్దంటూ చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి వు కియాన్ సోమవారం హెచ్చరించారు. 'పర్వతాన్ని కదిలించడం తేలికేమోగానీ, పీపుల్ లిబరేషన్ ఆర్మీని కదిలించడం మాత్రం చాలా కష్టం' అంటే తమ దేశా ఆర్మీ గురించి బీరాలు పోతూ రెచ్చగొట్టే తీరుగా ఆయన మాట్లాడారు. భారత సైన్యం తమ దేశానికి చెందిన భూభాగం డాంగ్‌లాంగ్‌ను దాటిందని, తమ రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకుందని ఆరోపించింది. అదే సమయంలో సిక్కింలోని డోక్లామ్ సరిహద్దు విషయంలో జోక్యం చేసుకున్నారని మండిపడింది. అక్కడ ఉన్న భారత సేనలను వెనక్కి పిలుచుకోవాలని చెప్పగా తాము కూడా చర్చలకు సిద్ధమేనని, అయితే, ఇరు దేశాల సైన్యాలను సమానంగా ఉపసంహరించుకోవాలని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. అయితే, భారత్ మాత్రమే ముందు తన సైన్యాన్ని విరమించుకోవాలని అప్పుడే చర్చలంటూ పట్టుబట్టింది. ఈ సమయంలోనే ఇరు దేశాల మధ్య సందిగ్దతను తొలగించేందుకు అమెరికా ముందుకొస్తుందని ఊహాగానాలు ఊపందుకుంటుండగా చైనా మాత్రం తన రెచ్చగొట్టే చర్యలను మాత్రం కొనసాగిస్తునే ఉంది. భారత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూడొద్దని భ్రమల్లో బ్రతకొద్దంటూ రెచ్చగొడుతూ మాట్లాడుతోంది. -
హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్ట్
ఏలూరు (సెంట్రల్) : సరిహద్దు తగాదాల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేసేందుకు యత్నించిన కేసులో నలుగురు నిందితులను టూటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు విలేకరులకు వివరించారు. ఏలూరు రూరల్ మండలం చొదిమెళ్ల గ్రామానికి చెందిన బండి రాంబాబు, అతడి అన్న కుమారుడు బండి బాబూరావులకు వంగూరు సమీపంలో 40 సెంట్ల భూమి ఉంది. దాని పక్కనే మురారి రాజేశ్వరరావు అలియాస్ ఊకరాజుకు చెందిన పొలం ఉంది. ఊకరాజుకు ఇటుకల తయారీ పరిశ్రమ కూడా ఉంది. రాంబాబుకు చెందిన పొలంలో ఉన్న మట్టి దిబ్బను ఇటీవలే తవ్వించి ట్రాక్టర్లలో తరలించేందుకు అతను సిద్ధపడ్డాడు. దీనిని ఊకరాజు అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరగ్గా ఊకరాజుకు గాయాలయ్యాయి. అతడిని ఏలూరులోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చగా.. పెదవేగి పోలీసులు బాబూరావు, రాంబాబుSపై కేసు నమోదు చేశారు. దాంతో తమ సమస్యను ఏలూరు ఎమ్మెల్యే బుజ్జికి చెప్పుకునేందుకు ఈనెల 6న వారిద్దరూ ఏలూరు వచ్చారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో పాతబస్టాండ్ సమీపంలోని ఓ అద్దాల షాపులోకి వెళ్లారు. తిరిగి బయటకు వచ్చే సమయంలో వారిపై కొంత మంది వ్యక్తులు కత్తులతో దాడికి తెగబడ్డారు. స్థానికులు పెద్దగా కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. హత్యాయత్నానికి పాల్పడిన మురాల నాగబాబు, మురాల సీతారామయ్యతో పాటు నలుగురు నిందితులను శనివారం అరెస్ట్ చేశారు. ఈ హత్యాయత్నంలో ఊకరాజు మనుమలైన ఇద్దరు బాలురు పాల్గొన్నట్టు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తులు, ఒక కారు, రెండు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. టూటౌన్ సీఐ జి.మధుబాబు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
'చైనాపై ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదు'
సెయింట్ పీటర్స్బర్గ్: తీవ్ర సరిహద్దు వివాదం ఉన్నా గత 40 సంవత్సరాల్లో చైనా సరిహద్దులో ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదని భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రష్యా పర్యటనలో భాగంగా ఆయనపై వ్యాఖ్యలు చేశారు. ఓబీఓర్ ప్రాజెక్టు భారత్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని చెబుతూ కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై ఎదురైన ప్రశ్నకు 'చైనాతో మాకు సరిహద్దు వివాదం ఉన్న మాట నిజమే. కానీ గత 40 ఏళ్లుగా సరిహద్దు వివాదం కారణంగా ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు' అని సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనమిక్ ఫోరమ్‌లో మోదీ సమాధానమిచ్చారు. ఒకప్పటిలా అమెరికా పంచనో లేక సోవియట్ యూనియన్ పంచనో దేశాలు చేరే కాలం పోయిందని అన్నారు. నేడు ప్రతి దేశం మిగిలిన ప్రపంచదేశాలతో సత్సంబంధాలను కోరుకుంటోందని చెప్పారు. కొద్ది దేశాలతో సమస్యలు ఉన్నా సంబంధాలు మాత్రం చెడిపోవడం లేదని అన్నారు. అందుకు వ్యాపార ధోరణేనని చెప్పారు. భారత్-రష్యాల మధ్య ఉన్న సంబంధం నమ్మకంతో కూడుకున్నదని చెప్పారు. ఎన్నో కఠిన సమయాల్లో కూడా ఈ సంబంధం చెడిపోలేదని తెలిపారు. భారత్-రష్యాల మధ్య కుదిరిన సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ గురించి ప్రస్తావిస్తూ.. ఒప్పందంలో ఉన్న ప్రతి అక్షరాన్ని ప్రపంచదేశాలు పరిగణలోకి తీసుకుంటాయని తనకు తెలుసునని అన్నారు.