పర్వతాన్ని కదిలిస్తారేమో.. మమ్మల్ని కష్టం: చైనా
అదే సమయంలో సిక్కింలోని డోక్లామ్ సరిహద్దు విషయంలో జోక్యం చేసుకున్నారని మండిపడింది. అక్కడ ఉన్న భారత సేనలను వెనక్కి పిలుచుకోవాలని చెప్పగా తాము కూడా చర్చలకు సిద్ధమేనని, అయితే, ఇరు దేశాల సైన్యాలను సమానంగా ఉపసంహరించుకోవాలని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. అయితే, భారత్ మాత్రమే ముందు తన సైన్యాన్ని విరమించుకోవాలని అప్పుడే చర్చలంటూ పట్టుబట్టింది. ఈ సమయంలోనే ఇరు దేశాల మధ్య సందిగ్దతను తొలగించేందుకు అమెరికా ముందుకొస్తుందని ఊహాగానాలు ఊపందుకుంటుండగా చైనా మాత్రం తన రెచ్చగొట్టే చర్యలను మాత్రం కొనసాగిస్తునే ఉంది. భారత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూడొద్దని భ్రమల్లో బ్రతకొద్దంటూ రెచ్చగొడుతూ మాట్లాడుతోంది.