మోదీ.. అబద్ధాలు ఎందుకు?: రాహుల్‌ | Congress Leader Rahul Gandhi Asks Why Modi Is Lying In China Issue | Sakshi
Sakshi News home page

మోదీ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు?

Published Thu, Aug 6 2020 1:56 PM | Last Updated on Thu, Aug 6 2020 3:46 PM

Congress Leader Rahul Gandhi Asks Why Modi Is Lying In China Issue  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనా-భారత్‌ సరిహద్దుల్లో ఇటీవల నెలకొన్న పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మే నెలలో తూర్పు ల‌డ‌ఖ్‌ ప్రాంతంలోకి చైనా ఆర్మీ ప్ర‌వేశించిన‌ట్లు తెలుపుతూ వచ్చిన ఓ వార్తను రాహుల్ గాంధీ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. జూన్ 15వ తేదీ గల్వాన్ లోయ వద్ద చైనా-భారత్ సైనికుల మధ్య జరిగిన ఘ‌ర్ష‌ణ కంటే నెల రోజుల ముందే చైనా ఆర్మీ భారత్‌లో ప్రవేశించిందని మండిపడ్డారు.

లద్దాఖ్‌ వద్ద భారత భూభాగాన్ని చైనా ద‌ళాలు మేలోనే ఆక్రమించాయని రక్షణ శాఖ ఒక రిపోర్టులో పేర్కొంది. ఈ విషయాన్ని ఒక జాతీయ మీడియా తన పత్రికలో ప్రచురించింది. అయితే వాస్తవాధీన రేఖ వద్ద భూభాగాన్ని చైనా బలగాలు ఆక్ర‌మించాయని భారత ర‌క్ష‌ణ‌శాఖ మాత్రం ఆ నిజాన్ని దాచి పెట్టిందని రాహుల్ చెప్పారు. కూగ్రంగ్ నాలా, గోగ్రా, పాన్‌గంగ్ సో ప్రాంతాల్లోకి మే నెల 17, 18వ తేదీల్లో చైనా ఆర్మీ వ‌చ్చిన‌ట్లు ర‌క్ష‌ణ శాఖ తెలిపిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయంపై ప్ర‌ధాని నరేంద్రమోదీ ఎందుకు అసత్యాలు చెబుతున్నార‌ని రాహుల్‌ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చైనా- భారత్‌ మధ్య జరిగిన ఘర్షణలలో 20 మందికి పైగా భారత్‌ సైనికులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. 

చదవండి: ఆ వార్త అవాస్తవం: చైనా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement